SBI Fixed Deposits | ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చ.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేటు అయిన రెపో రేటు పెంచిన నేపథ్యంలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కూడా ఇదే దారిలో నడిచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణయం నేటి నుంచే అంటే డిసెంబర్ 13 నుంచే అమలులోకి వచ్చింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుంది. గతంలో కన్నా ఇకపై అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
ఒకేసారి 13 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ!
ఎస్‌బీఐ తాజాగా రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 100 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగాయి. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ తెరిచే వారికే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అలాగే పాత ఎఫ్‌డీలను రెన్యూవల్ చేసుకునే వారికి కూడా కొత్త ఎఫ్‌డీ రేట్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.
బంపర్ బొనాంజా.. కస్టమర్లకు ఒకేసారి 4 బ్యాంకుల శుభవార్త!
అలాగే 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై అయితే 5.75 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే 6.75 శాతం వడ్డీ లభిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఇదే వడ్డీ రేటు ఉంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డ పాజిట్లపై అయితే 6.25 శాతం వడ్డీ వస్తుంది. అలాగే ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 6.25 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎస్‌బీఐ స్టాఫ్, ఎస్‌బీఐ పెన్షనర్లకు అయితే ఒక శాతం అధిక వడ్డీ రేటు వస్తుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్‌కు కూడా అధిక వడ్డీ లభిస్తుంది. వీరికి 0.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, FD rates, Fixed deposits, Rbi, Sbi, State bank of india