Home /News /business /

SBI HIKES MCLR BY 10 BPS WITH EFFECT FROM 16TH MAY HECK RATES HERE GH VB

SBI MCLR Rules: మరోసారి స్టేట్‌బ్యాంక్ MCLR పెంపు..  అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది.

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నెల 15 నుంచి ఈ రేట్ల పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ(SBI) ప్రకటించింది. రెండు నెల వ్యవధిలో బెంచ్‌మార్క్ రుణ రేట్లను ఎస్‌బీఐ పెంచడం ఇది రెండోసారి.  మే 15 నుంచి ఎస్‌బీఐ ఒక సంవత్సరం MCLR 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల MCLR.. 7.30 శాతంతో పోలిస్తే 7.40 శాతానికి చేరింది. అదే విధంగా మూడేళ్లకు బెంచ్‌మార్క్(Bench Mark) మునుపటి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది. మూడు నెలలు, ఒక నెల, ఓవర్‌నైట్ కాలానికి ఒక్కొక్కదానిపై 6.85 శాతానికి పెరిగింది. ఆరు నెలల MCLR మునుపటి 7.05 శాతం నుంచి 7.15 శాతానికి చేరింది.

Ford: భార‌త్‌లో ఫోర్డ్ సంస్థ​కు భారీ లాస్‌.. ఎన్ని వేల కోట్లు నష్టపోయిందంటే?

* ఏప్రిల్‌ నుంచి దాదాపు 20 బేసిస్‌ పాయింట్ల పెంపు
గత నెలలో కీలకమైన పాలసీ రెపో రేటులో ఆర్‌బీఐ 40 బేసిస్ పాయింట్లు పెంచడానికి ముందే ఎస్‌బీఐ ఈ బెంచ్‌మార్క్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నెల ప్రారంభంలో RBI పాలసీ రెపో రేటును 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎస్‌బీఐ MCLRలో దాదాపు 20 బేసిస్ పాయింట్లు పెంచింది.

MCLR అనేది రుణదాతలు రుణం ఇవ్వడానికి అనుమతించని దిగువ బెంచ్‌మార్క్ రేటు. అంతకంటే దిగువ రేటుతో రుణాలు ఇవ్వకూడదు. మెజారిటీ బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ కంటే తక్కువ శాతానికి టర్మ్ లోన్‌లను అందించవు. అయినప్పటికీ చాలా బ్యాంకులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి టర్మ్ లోన్‌లను ఎక్స్‌టెర్నల్‌ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లకు లింక్ చేస్తాయి.

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. డిసెంబర్ 2021 నాటికి, వ్యక్తిగత రుణాలలో 45.1 శాతం MCLRతో అనుసంధానించి ఉండగా, వాటిలో 46.2 శాతం ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌తో లింక్‌ అయి ఉన్నాయి. హౌసింగ్ లోన్‌లలో దాదాపు 33.1 శాతం ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమై ఉండగా, 58.2 శాతం బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ అయి ఉన్నాయి. అయితే డిసెంబర్ 2021 నాటికి వాహన రుణాలలో 60 శాతం MCLRతో లింక్ అయ్యాయి.

LIC IPO: రికార్డులు తిర‌గ‌రాస్తున్న ఎల్ఐసీ.. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ

పెరిగిన లాభాలు
ఎస్‌బీఐ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. స్టాండర్డ్ లోన్‌ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,114 కోట్ల నికర లాభాన్ని చూపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.6,451 కోట్లుగా ఉంది. ఎస్‌బీఐ మొత్తం ఆదాయం గతేడాది నమోదైన రూ.81,327 కోట్ల నుంచి రూ.82,613 కోట్లకు పెరగడం గమనార్హం.
Published by:Veera Babu
First published:

Tags: Interest rates, Mclr, Sbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు