హోమ్ /వార్తలు /business /

SBI: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. తాజా రేట్లను పరిశీలించండి..

SBI: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. తాజా రేట్లను పరిశీలించండి..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఇటీవల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ.. తాజాగా రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్​న్యూస్​(Good News) చెప్పింది. ఇటీవల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ.. తాజాగా రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్​డీలపై వడ్డీ రేట్లను 5.1 శాతం నుంచి 5.4 శాతం వరకు పెంచింది. సీనియర్​ సిటిజన్లకు(senior Citizens) అదనంగా 50 బేసిస్​ పాయింట్ల వరకు ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది. ఆర్​డీ వడ్డీ రేట్ల పెంపు జనవరి 15 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. మినిమం రూ. 100ల​తో రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాను తెరిచేందుకు అవకాశం కల్పించింది. కనీసం 6 నెలల నుంచి 10 సంవత్సరాల వ్యవధితో ఎస్​బీఐ ఆర్​డీ అకౌంట్​ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. ఎస్​బీఐ ఆర్​డీ పై వర్తించే వడ్డీ రేటు ఫిక్స్​డ్ డిపాజిట్ (FD)పై వచ్చే వడ్డీకి సమానంగా, సేవింగ్స్​ అకౌంట్ వడ్డీ కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.

  Union Budget: ఈ బడ్జెట్​లో వర్క్​ ఫ్రం హోం చేసేవారికి గుడ్​న్యూస్? పన్ను మినహాయింపులు ఉండే ఛాన్స్?

  ఎంత కాలానికి ఎంత వడ్డీ?

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ఆర్​డీ వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 5.1- 5.4 శాతం మధ్య మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీ గల రికరింగ్ డిపాజిట్​పై 5.1 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మెచ్యూరిటీపై 5.1 శాతం, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలోపు మెచ్యూరిటీపై 5.3 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీపై 5.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

  ఆర్​డీ అకౌంట్​ ఎలా తెరవాలి?

  మీరు ఎస్​బీఐలో రికరింగ్ డిపాజిట్ ఖాతాను మొత్తం రెండు మార్గాల్లో తెరవవచ్చు. మీ స్థానిక ఎస్​బీఐ బ్రాంచ్​ను సందర్శించడం ద్వారా లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆర్​డీ అకౌంట్​ను ఓపెన్​ చేయవచ్చు. మీరు ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్​ హోల్డర్​ అయితే, మీ నెట్ బ్యాంకింగ్ యూజర్​ నేమ్​, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి e-RD ఖాతా తెరవచ్చు.

  ఆర్​డీ ఖాతాను ఎవరు తెవరచ్చు?

  భారతీయ నివాసితులు లేదా హిందూ అవిభక్త కుటుంబ సభ్యులు మాత్రమే రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవగలరు. నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE) లేదా నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO)కి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఎన్​ఆర్​ఐలు సైతం ఆర్​డీ ఖాతా ఓపెన్​ చేయవచ్చు.

  త్వరలోనే టాటా నుంచి బ్లాక్​బర్డ్​ మిడ్​ రేంజ్ ఎస్​యూవీ లాంచ్​.. సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వేరియంట్లలోనూ లభ్యం

  ప్రీమెచ్యూర్​ విత్​డ్రా రూల్స్​ ఏంటి?

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్​డీ నుంచి మెచ్యూరిటీ పూర్తవ్వకముందే డిపాజిట్లను విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే, దీనికి మీరు నామినల్​ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్​డీ నుంచి పార్షియల్​ విత్​డ్రాలను అనుమతించదు.

  First published:

  ఉత్తమ కథలు