SBI Interest Rates | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా చెప్పుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు భారీ షాకిచ్చింది. అన్ని బ్యాంకుల (Banks) దారిలోనే ఎస్‌బీఐ కూడా నడిచింది. రుణ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే ఇప్పటికే లోన్ తీసుకున్న వారిపై కూడా ఎఫెక్ట్ ఉండనుంది.
ఎస్‌బీఐ తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులోకి వచ్చింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈఎంఐ పెంపు ప్రభావం పడబోతోంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే.. అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును పెంచేశాయి.
ఆఫర్లే ఆఫర్లు.. రూ.20 వేల భారీ డిస్కౌంట్! వారికి ఇయర్ ఎండ్ ధమాకా డీల్స్!
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఎంసీఎల్ఆర్ పెంచేసింది. కేవలం రుణ రేట్లు మాత్రమే కాకుండా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు కూడా పెంచుతున్నాయి.
ఉద్యోగులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. కీలక ప్రకటన!
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. నెల రోజుల ఎంసీఎల్ఆర్, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 8 శాతానికి చేరింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ , ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు 8.05 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగాయి. చాలా వరకు రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆటో, హోమ్, పర్సనల్ లోన్స్ వంటి వాటికి ఏడాది ఎంసీఎల్ఆర్ ప్రామాణకంగా ఉంటుంది. ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.5 శాతానికి ఎగసింది. అలాగే మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.35 శాతం నుంచి 8.6 శాతానికి చేరింది. ఎస్‌బీఐ చివరిగా నవంబర్ 15న ఎంసీఎల్ఆర్ రేటును సవరించింది. అప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది.
ఇకపోతే ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు ఈబీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.9 శాతానికి చేరింది. దీనికి సీఆర్‌పీ, బీఎస్‌పీ అదనం. అలాగే రెపో రేటు లింక్డ్ లోన్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ కూడా 8.15 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. దీనికి సీఆర్‌పీ అదనం. ఇంకా ఎస్‌బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 14.15 శాతానికి ఎగసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Home loan, Mclr, Sbi, State bank of india