Home /News /business /

SBI HIKES FIXED DEPOSIT FD RATES HOW THEY COMPARE WITH HDFC BANK KOTAK MAHINDRA BANK GH VB

Fixed Deposits: ఎఫ్​డీ రేట్లను పెంచిన ప్రముఖ బ్యాంకులు.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా బ్యాంకులు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ)పై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్​) వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా బ్యాంకులు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ)పై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్​) వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్​డీలపై వడ్డీ రేటు పెంపు వర్తిస్తుందని తెలిపాయి. కాగా, ఎస్​బీఐ కొత్త వడ్డీ(New Interest Rates) రేటు జనవరి 15 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎస్​బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.0 శాతం నుంచి 5.1 శాతానికి వడ్డీ రేటు పెంచింది. ఇక, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌డీపై 5.10 శాతం వడ్డీ అందజేస్తుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు 5.30 శాతం వడ్డీ రేటు ఆఫర్​ చేస్తుంది. ఈ వ్యవధిలోనే సీనియర్ సిటిజన్లకు(Senior Citizens) 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అదనపు వడ్డీ లభిస్తుంది.

ఎస్​బీఐ తాజా ఎఫ్​ఢీ వడ్డీ రేట్లు ఇవే..
7 రోజుల నుంచి 45 రోజులకు 2.9%, 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 3.9%, 180 రోజుల నుంచి ఏడాది వరకు 4.4%, ఏడాది నుంచి మూడేళ్ల​ వరకు 5.1%, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.3%, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.4% ఎఫ్​డీ వడ్డీ రేట్లను ఎస్బీఐ ఆఫర్​ చేస్తుంది.

Term Policy Premiums: టర్మ్ పాలసీలను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..


హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ తాజా ఎఫ్​డీ వడ్డీ రేట్లు..
ప్రైవేట్​ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ సైతం ఎఫ్​డీ వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచి వర్తిస్తాయి. తాజా వడ్డీ రేట్ల ప్రకారం, 7 నుంచి 14 రోజుల వరకు 2.50%, 15- 29 రోజుల వరకు 2.50%, 30 నుంచి 90 రోజుల వరకు 3%, 91 రోజుల నుంచి 6 నెలల వరకు 3.5%, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.4%, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5%, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 5.20%, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.40%, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.60% వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజా ఎఫ్​డీ వడ్డీ రేట్లు..
కోటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేటును పెంచింది. ఈ తాజా వడ్డీ రేట్లు జనవరి 6 నుంచి వర్తిస్తాయి. కోటక్​ మహీంద్రా వెబ్​సైట్​ ప్రకారం, 7 నుంచి 30 రోజుల వరకు 2.50%, 31 రోజుల నుంచి 90 రోజుల వరకు 2.75%, 91 నుంచి 120 రోజుల వరకు 3%, 121 రోజుల నుంచి 179 రోజుల వరకు 3.25%, 180-269 రోజుల వరకు 4. 40%, 271- 363 రోజుల వరకు 4.40%, 365- 389 రోజుల వరకు 4.9%, 390- 391 రోజుల వరకు 5%, 392 రోజుల నుంచి రెండేళ్ల వరకు 5.10%, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 5.15%, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.3% వడ్డీ రేటు ఆఫర్​ చేస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Banks, Interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు