SBI HDFC BANK HIKE FIXED DEPOSIT INTEREST RATES HERES A COMPARISON WITH ICICI BANK GH VB
FD Tenure: ఆ ఎఫ్‌డీల కాలపరిమితిని మూడేళ్లకు తగ్గిస్తేనే మేలంటున్న బ్యాంకులు.. ఎందుకంటే..?
ప్రతీకాత్మక చిత్రం
ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం నిర్దేశించిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రముఖ ఇండియన్ బ్యాంకులు. దీంతోపాటు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) వంటి మ్యూచువల్ ఫండ్లకు అనుగుణంగా పన్ను ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ట్యాక్స్ బెనిఫిట్స్ (Tax benefits) కోసం నిర్దేశించిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రముఖ ఇండియన్ బ్యాంకులు(Indian Banks). దీంతోపాటు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(Equity Linked Saving Schemes) వంటి మ్యూచువల్ ఫండ్లకు(Mutual Funds) అనుగుణంగా పన్ను ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్(Deposit) పథకాలపైనే పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం-1961 సెక్షన్ 80సీ కింద ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్(FD) పథకంలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుందని బ్యాంకిగ్ నిపుణులు చెబుతున్నారు. 80సీ కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయిన ELSS వంటి వాటితో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో(FD) పెట్టుబడుల వైపు ఎక్కువ మంది దృష్టిసారించట్లేదు. ఈ నేపథ్యంలో లాక్-ఇన్ పీరియడ్‌ను తగిస్తే ఎఫ్‌డీల్లోకి ఆకర్షణీయ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి సమర్పించిన ముందస్తు బడ్జెట్ ప్రతిపాదనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) పేర్కొంది. లాక్ ఇన్ వ్యవధిని ప్రస్తుతమున్న ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడంతో పాటు.. ఐబీఏ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.
అలా అయితేనే మేలు..
ఆర్థిక కార్యకలాపాలు, డిజిటల్ బ్యాంకింగ్‌ను(Digital Banking) ప్రోత్సహించడం కోసం చేసిన ఖర్చులకు బ్యాంకులు ప్రత్యేక రాయితీలను కోరాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి మరింత మంది వచ్చే అవకాశం ఉందని.. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను బ్యాంకులు సమర్థంగా అమలు చేయగలవని ఐబీఏ తెలిపింది. "బ్యాంకులు ప్రజలకు అందించే ప్రయోజనాల ద్వారా వ్యాపారాలు చేయడం సులభం అవుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ విస్తృతం అవుతుంది.
కాబట్టి ప్రత్యేక పన్ను రాయితీ(Subsidy on Tax) రూపంలో కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి" అని పేర్కొంది. పన్నులకు సంబంధించిన వ్యాజ్యాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా బ్యాంకులు కోరుతున్నాయి.
వ్యాజ్యాల భారం తగ్గించండి..
వాస్తవానికి ఏదైనా పన్ను సంబంధిత కేసుల్లో బ్యాంకులు చేసే అప్పీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న మొత్తాలతో కూడిన వ్యాజ్యాల కిందకు వస్తాయి. అయితే కొన్ని కేసుల్లో భారీ మొత్తాలతో కూడిన వ్యాజ్యాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. "బ్యాంకులు, ప్రభుత్వ శాఖల మధ్య తలెత్తే అప్పీళ్లను వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ఇతర వివాదాల విచారణ కోసం కమిటీలు ఉన్నట్లుగా.. ఆదాయ పన్ను శాఖ, వివిధ డిపార్ట్మెంట్ల మధ్య వ్యాజ్యాలను తగ్గించేందుకు, అప్పీల్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం అవసరం" అని ఐబీఏ స్పష్టం చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.