హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి..

Banks: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి..

Banks: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి..

Banks: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి..

HDFC Bank | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. మీకు ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు స్పెషల్ స్కీమ్స్‌ను ఎత్తివేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

State Bank Of India | దేశంలోనే అతిపెద్ద బ్యాంకులుగా కొనసాగుతూ వస్తున్న ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (Bank) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ అందించాయి. స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్‌ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ నెల చివరి వరకే ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇక వీటిల్లో డబ్బులు (Money) పెట్టడం కుదరదు. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

ఎస్‌బీఐ అమృత్ కలష్ పేరుతో ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని టెన్యూర్ 400 రోజులు ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే 7.1 శాతం వడ్డీ వస్తుంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.6 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల చేరాలని భావించే వారు ఇప్పుడే చేరొచ్చు.

గుడ్ న్యూస్.. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సిన పని లేదు.. వారికి కేంద్రం ఊరట!

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా స్పెషల్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ దీని పేరు. ఈ స్కీమ్ 2020 మే నెల నుంచి అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ కూడా మార్చి నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి అదనంగా 0.25 శాతం వడ్డీ వస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్‌కు అందించే 0.5 శాతం వడ్డీకి అదనం.

రూ.66 వేల ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.38 వేలకే కొనండి.. భారీ డిస్కౌంట్ ఆఫర్!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణంగా రెగ్యులర్ కస్టమర్లకు ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఈ స్పెషల్ స్కీమ్‌లో చేరితే మాత్రం 7.75 శాతం వడ్డీ రేటు వస్తుంది. అంటే అధిక వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అందువల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు ఉంటే.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. కేవలం ఒక వారం మాత్రమే గడువు ఉంది. అందువల్ల మీరు డబ్బులు దాచుకోవాలని భావిస్తే.. వెంటనే ఎస్‌బీఐ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు వెళ్లి ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోవచ్చు.

బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ. 5 లక్షల వరకే బీమా వస్తుంది. అందువల్ల ఈ మొత్తాన్ని మించి డబ్బులు దాచుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. దిగ్గజ బ్యాంకుల్లో అయితే ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. అయితే చిన్న చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

First published:

Tags: Bank, Bank news, HDFC bank, Sbi, State bank of india

ఉత్తమ కథలు