హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? వీటిపై ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో తెలుసుకోండి..

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? వీటిపై ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో తెలుసుకోండి..

 Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? వీటిపై ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో తెలుసుకోండి

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? వీటిపై ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో తెలుసుకోండి

ప్రస్తుతం అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ కార్డ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. క్రెడిట్ బేస్డ్‌ ట్రాన్సాక్షన్ల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. సక్రమంగా వినియోగించడం తెలిస్తే, వీటితో చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రస్తుతం అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ కార్డ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. క్రెడిట్ బేస్డ్‌ ట్రాన్సాక్షన్ల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. సక్రమంగా వినియోగించడం తెలిస్తే, వీటితో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లో (Credit Card) అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌తో ట్రాన్సాక్షన్‌లు నిర్వహించవచ్చు. అదే డెబిట్ కార్డ్‌లు బ్యాంక్ అకౌంట్‌లకు (Bank Account) లింక్‌ అయి ఉంటాయి, ప్రతి ట్రాన్సాక్షన్‌కు తగిన మొత్తాన్ని డెబిట్ చేస్తాయి. క్రెడిట్‌ కార్డ్‌లో వినియోగించిన మొత్తాన్ని క్రెడిట్ పీరియడ్‌ ముగిసేలోపు తిరిగి చెల్లించవచ్చు.

ప్రతి క్రెడిట్ కార్డ్‌కి క్రెడిట్ లిమిట్‌ ఉంటుంది. ఆ లిమిట్‌ ప్రకారం కార్డుతో ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. వ్యక్తుల క్రెడిట్‌ రిపోర్ట్‌, ఆదాయం బేస్‌ చేసుకొని బ్యాంకులు క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ను అందజేస్తాయి. ఆ లిమిట్‌కు మించి వినియోగదారులు ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఇది కార్డ్ హోల్డర్ వాడుకోగల గరిష్ఠ మొత్తాన్ని సూచిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు ఈ మొత్తాన్ని నిర్దేశిస్తాయి.

అలర్ట్.. ఇక ఈ రూపాయి కాయిన్లు కనిపించవు, బ్యాంక్ కీలక ప్రకటన!

అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే రకమైన క్రెడిట్‌ కార్డులు అందించవు. ప్రతి బ్యాంకు నిర్ణీత అవసరాల కోసం క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంది. ప్రతి క్రెడిట్ కార్డ్ కొన్ని ప్రత్యేక ఫీచర్‌లను ఆఫర్‌ చేస్తుంది. క్రెడిట్‌ కార్డ్‌ అందిస్తున్న సంస్థ, క్రెడిట్‌ కార్డ్‌ టైప్‌ ఆధారంగా బెనిఫిట్స్‌ మారుతుంటాయి. ఆయా కార్డ్‌లు అందిస్తున్న బెనిఫిట్స్‌ను ముందుగా పరిశీలించి, అవసరమైన దానికి ఎంచుకోవచ్చు. అయితే రీపేమెంట్ చేయగలిగే వనరులు ఉంటేనే, అది కూడా నిర్ధిష్ట అవసరాలు తీరుస్తాయని భావిస్తేనే క్రెడిట్ కార్డులను ఎంచుకోవడం మంచిది.

కొత్త ఇల్లు కొనే వారికి బంపరాఫర్.. బజాజ్ రూ.4,999 ఈఎంఐ స్కీమ్!

క్రెడిట్ కార్డ్‌తో అనేక బెనిఫిట్స్‌ పొందవచ్చు. వీటితో వస్తువుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం తగ్గుతుంది. ఈ బెనిఫిట్స్‌లో వెల్‌కమ్‌ ఆఫర్లు ఉంటాయి. వెల్‌క‌మ్‌ ఆఫర్‌ కింద కొన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లలో, ఆన్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేసే వస్తువులపై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అదనంగా రివార్డ్ పాయింట్‌లు/ క్యాష్‌బ్యాక్/ డిస్కౌంట్‌లు కూడా పొందవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్‌పై వినియోగదారులకు రివార్డ్‌ పాయింట్‌లు లభిస్తాయి. వీటిని ప్రొడక్ట్స్‌ కొనుగోలుకు ఉపయోగించవచ్చు. లేదా రివార్డ్‌ పాయింట్‌లను ఎన్‌క్యాష్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది.

ప్రస్తుతం వివిధ బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్‌ కార్డులపై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, EMI కన్వెర్షన్‌ ఆప్షన్‌లు ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్డులతో కాన్‌సియర్జ్‌ సర్వీస్‌, ఇన్సూరెన్స్‌ కవర్ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో నిర్దేశించిన మొత్తాన్ని క్రెడిట్‌ కార్డ్‌లో వినియోగిస్తే యాన్యువల్‌ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కార్డులకు యాన్యువల్‌ ఛార్జీలు ఉండవు.

First published:

Tags: Banks, Credit cards, HDFC bank, Icici bank, Sbi

ఉత్తమ కథలు