
(Photo Reuters)
యెస్ బ్యాంక్‌లో వాటా తీసుకునేందుకు ఎస్బీఐతో చేతులు కలపాలని ఎల్ఐసీని కూడా కోరినట్టు సమాచారం అందుతోంది.
YES BANK: ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్షియం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెస్ బ్యాంక్‌ను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎస్బీఐ బోర్డు సమావేశం కూడా ఈ నేపథ్యంలోనే గురువారం జరగడం ప్రాధాన్యత పొందింది. యెస్ బ్యాంక్‌లో వాటా తీసుకునేందుకు ఎస్బీఐతో చేతులు కలపాలని ఎల్ఐసీని కూడా కోరినట్టు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ఎల్ఐసీకి యెస్ బ్యాంక్‌లో 8శాతం వాటా ఉంది. ఇదలా ఉంటే నిధుల కొరత ఎదుర్కొంటున్న యెస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. బ్యాంకు ఖాతాదారులెవరూ తమ ఖాతాల నుంచి నెలకు రూ.50,000కు మించి విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదని పేర్కొంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. అలాగే బ్యాంక్ బోర్డునీ రద్దు చేసి ఎస్బీఐ మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.
Published by:Krishna Adithya
First published:March 06, 2020, 15:44 IST