ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీసుకునే లోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వాహనాల రుణాలతో పోలిస్తే 20 బేసిస్ పాయింట్స్ తగ్గింపు లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఫాస్టర్ అడాప్షన్ & మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్-FAME II స్కీమ్ ప్రారంభించింది కేంద్రం. ఈ పథకంలో ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, ఎలక్ట్రిక్ కారుకు రూ.35,000 సబ్సిడీ లభించనుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా చర్యల్ని తీసుకోవడం విశేషం. 'ఎస్బీఐ గ్రీన్ కార్ లోన్ స్కీమ్' పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల రుణాలపై 20 బేసిస్ పాయింట్స్ డిస్కౌంట్ ఇస్తోంది ఎస్బీఐ.
2019 ఆర్థిక సంవత్సరంలో కార్ ఇండస్ట్రీలో 36 లక్షల వాహనాలు అమ్ముడుపోగా ఎలక్ట్రిక్ కార్లు వెయ్యి మాత్రమే అమ్మినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక టూవీలర్ సెగ్మెంట్లో ఏడాదిలో 2 కోట్ల టూవీలర్స్ అమ్మితే, ఎలక్ట్రిక్ బైకులు 54,000 మాత్రమే అమ్మారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి తక్కువగానే ఉందని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తోంది ఎస్బీఐ.
ఆటో లోన్ సెగ్మెంట్లో ఎస్బీఐ గ్రీన్ కార్ లోన్ స్కీమ్ మార్పు తీసుకొస్తుందని, కస్టమర్లు పర్యావరణానికి మేలు చేసి, గాలి నాణ్యతను పెంచే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నాం.
— పీకే గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్
వాహనాల రుణాలపై 20 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో పాటు రీపేమెంట్ కాలవ్యవధిని 8 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్‌లో లోన్ తీసుకుంటే మొదటి ఆరు నెలలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
Realme 3 Pro: రిలీజైన రియల్మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.