SBI General Insurance: గూగుల్ పేతో ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​ భాగస్వామ్యం... ఇంటి నుంచే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు

SBI General Insurance: గూగుల్ పేతో ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​ భాగస్వామ్యం... ఇంటి నుంచే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు (image: SBI General)

SBI General Insurance | ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కస్టమర్లు ఇకపై గూగుల్ పే (Google Pay) ద్వారా హెల్త్ ఇన్స్యూరెన్స్ (Health Insurance) తీసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ పేతో ఒప్పందం చేసుకుంది ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్.

  • Share this:
ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన 'ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్' (SBI General Insurance) కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తన సేవలను మెరుగుపరుస్తోంది.ఇంటి నుంచే బీమా కొనుగోలు చేసేందుకు కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా గూగుల్ పేతో (Google Pay) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్‌బీఐ జనరల్ కంపెనీ గూగుల్ పేతో సాంకేతిక సహకారాన్ని బుధవారం ప్రకటించింది. ఈ సహకారంతో కస్టమర్లు నేరుగా గూగుల్ పే యాప్‌లోనే ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బీమా సేవల పంపిణీని విస్తరించాలనే ప్రయత్నంలో భాగంగా ఎస్‌బీఐ జనరల్ గూగుల్ పే సాయం తీసుకుంటోంది.

గూగుల్ పేతో భాగస్వామ్యం


భారతదేశంలో బీమా ప్రొవైడర్‌తో గూగుల్ పే భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇకపై కస్టమర్లు గూగుల్ పే స్పాట్(Google Pay Spot)లోనే క్షణాల్లో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసుకోవచ్చు. “నేటి కస్టమర్లు తమ అవసరాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. కరోనాతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరిగింది. ఆర్థిక సేవలను అందించడంలో కస్టమర్ల అంచనాల ప్రకారం టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 17 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న ఈ అవసరాన్ని పరిష్కరించడానికి ఈ సహకారం మరొక ప్రయత్నం. తద్వారా ఎక్కువ సంఖ్యలో వ్యక్తులను బీమా పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఈ సహకారంతో గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ జనరల్.. ఆరోగ్య సంజీవని అనే ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్‌ను సరసమైన ప్రీమియంతో అందిస్తుంది." అని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈఓ ప్రకాష్ చంద్ర కంద్‌పాల్ తెలిపారు.

LPG Gas Cylinder Price: సిలిండర్ ధర రూ.1,000 దాటుతుందా? నాలుగు రోజుల్లో ఏం జరగబోతోంది?

అతి తక్కువ ప్రీమియంతో స్టాండర్డ్​ కవరేజీ


గూగుల్ పే యూజర్లు ఎస్‌బీఐ కొత్తగా అందిస్తున్న సేవలతో గూగుల్ పే స్పాట్‌లో ఎస్‌బీఐ జనరల్ ఆరోగ్య బీమా అయిన ఆరోగ్య సంజీవనిని కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్య సంజీవని అనేది ప్రామాణికమైన ఆరోగ్య బీమా పాలసీ. ఇది అతి తక్కువ ప్రీమియంలతో స్టాండర్డ్ కవరేజీని అందిస్తుంది. అలాగే దేశంలో ఆరోగ్య బీమా కొనుగోళ్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యూజర్లు గూగుల్ పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవని పాలసీ కింద వ్యక్తిగత, కుటుంబ ప్లాన్‌లను కొనుగోలు చేయగలరు.
Published by:Santhosh Kumar S
First published: