హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI General Insurance: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఎస్‌బీఐ జనరల్ గుడ్ న్యూస్

SBI General Insurance: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఎస్‌బీఐ జనరల్ గుడ్ న్యూస్

SBI General Insurance: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఎస్‌బీఐ జనరల్ గుడ్ న్యూస్
(image: SBI General Insurance)

SBI General Insurance: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఎస్‌బీఐ జనరల్ గుడ్ న్యూస్ (image: SBI General Insurance)

SBI General Insurance | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవలి వరదల్లో నష్టపోయిన తమ కస్టమర్లలో క్లెయిమ్ చేసే అవకాశం ఉన్నవారినుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్.

  కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. రోడ్లు కొట్టుకుపోయాయి. ఆస్తులు, వ్యాపారాలు ధ్వంసం అయ్యాయి. తీవ్ర పంట నష్టం రైతులకు నష్టం కలిగించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదలు తీవ్రమైన నష్టానికి కారణమయ్యాయి. ఈ వరదలో నష్టపోయినవారికని ఆదుకోవడానికి ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ తన వంతు కృషి చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో తమ కస్టమర్లను సంప్రదిస్తోంది. వాళ్లు ఏ విధంగా నష్టపోయారో తెలుసుకుంటోంది. వారికి జరిగిన నష్టానికి ఏదైనా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తుందా లేదా అని ఆరా తీస్తోంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన క్లెయిమ్ దరఖాస్తుల్ని వీలైనంత త్వరగా సెటిల్ చేసేందుకు చర్యలు తీసుకుంది.

  LIC Jeevan Labh policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ మీ సొంతం

  WhatsApp Payments: రిజిస్టర్ నుంచి ట్రాన్సాక్షన్ వరకు... వాట్సప్ పేమెంట్స్‌లో మీ సందేహాలకు సమాధానాలు ఇవే

  వరదల కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, తయారీ యూనిట్స్, ఫ్యాక్టరీలు, షాపులు, గోడౌన్స్ నీటమునిగాయి. వీటిని నిర్వహించే వ్యాపారులు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు 120 ప్రాపర్టీ క్లెయిమ్స్‌ను పరిశీలించింది ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్. వీటిలో ఎక్కువగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచే ఉన్నాయి. ఈ వ్యాపారాలు తిరిగి నిలదొక్కుకోవడానికి మద్దతుగా నిలుస్తోంది ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్.

  మా పాలసీహోల్డర్లు క్లెయిమ్ సెటిల్మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వేర్వేరు మార్గాల్లో వారిని సంప్రదించాం. ఇప్పటి వరకు ప్రాపర్టీ, బిజినెస్ డ్యామేజ్‌కు సంబంధించిన 120 క్లెయిమ్స్ వచ్చాయి. మోటార్ వాహనాలకు సంబంధించి 100 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిలో ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలకు చెందినవే. జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేయడం మా మొదటి ప్రాధాన్యత. వ్యాపారాలు తిరిగి వేగంగా పుంజుకోవడం కోసం కృషి చేస్తున్నాం. వరదల కారణంలా నష్టాలు ఎదుర్కొన్న మా కస్టమర్లు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం.

  పీసీ కంద్‌పాల్, ఎండీ, సీఈఓ, ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్

  గతంలో వచ్చిన వరదలు మాత్రమే కాదు... ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చెరి, ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుఫాను కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ వేగంగా చేస్తామని ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ప్రకటించింది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Floods, Hyderabad Floods, Insurance, Sbi, State bank of india

  ఉత్తమ కథలు