SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే

SBI General Insurance Arogya Sanjeevani Policy | మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీని ప్రారంభించింది. లాభాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 7, 2020, 12:45 PM IST
SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే
SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్య సంజీవని పాలసీని అందిస్తోంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది. ఈ పాలసీని అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. మీరు ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పాలసీ తీసుకున్నా 'ఆరోగ్య సంజీవని' పేరుతోనే ఉంటుంది. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మరి ఆరోగ్యానికి రక్షణతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చే ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ గురించి తెలుసుకోండి.

TRAI App: కేబుల్, డీటీహెచ్ బిల్లు తగ్గించుకోవాలా? ఈ యాప్ ట్రై చేయండి

ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీని రూ.1,00,000 నుంచి రూ.5,00,000 వరకు కవరేజీతో తీసుకోవచ్చు. ప్రీమియంను మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ మోడ్‌లో చెల్లించొచ్చు. ఒక ఏడాది పాలసీ క్లెయిమ్ చేసుకోకపోతే 5% బోనస్ లభిస్తుంది. అంటే మీరు రూ.5,00,000 పాలసీ తీసుకుంటే ఒక ఏడాది పాలసీ క్లెయిమ్ చేయకపోతే వచ్చే ఏడాది నుంచి 5% బోనస్‌తో కలిపి రూ.5,25,000 కవరేజీ లభిస్తుంది. ఇలా పాలసీ బ్రేక్ చేయకుండా రెన్యువల్ చేసుకుంటూ పోతే గరిష్టంగా 50% వరకు బోనస్ పొందొచ్చు. 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం మూడేళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఎవరైనా ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకోవచ్చు.

Savings Scheme: రూ.66 లక్షలు రిటర్న్ ఇచ్చే ఈ స్కీమ్ గురించి తెలుసా?

ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం వివరాలు చూస్తే రూ.5,00,000 లక్షల పాలసీకి 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.4400 ప్రీమియం చెల్లించాలి. 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.5311 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.6181 ప్రీమియం చెల్లించాలి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇక ఈ పాలసీ ద్వారా వచ్చే లాభాల వివరాలు చూస్తే రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులను పాలసీ కవరేజీలో 2% లేదా గరిష్టంగా రోజుకు రూ.5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐసీయూ, ఐసీసీయూ ఖర్చుల కోసం పాలసీ కవరేజీలో 5% లేదా రోజుకు రూ.10,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్జన్, అనెస్తెటిస్ట్, స్పెషలిస్ట్, బ్లడ్, మెడికల్ ప్రాక్టీషనల్, కన్సల్టెంట్ ఫీజులన్నీ కవర్ అవుతాయి. సర్జికల్ ఎక్యూప్‌మెంట్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇందులో కవర్ అవుతాయి.

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాతో ప్రభుత్వ పథకాలు పొందొచ్చు... అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

క్యాటరాక్ట్ చికిత్స కోసం ఒక పాలసీ సంవత్సరంలో పాలసీ కవరేజీలో 25% లేదా రూ.40,000 వరకు పొందొచ్చు. గాయాల కారణంగా దంత చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ లాంటివి ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అవుతాయి. అంబులెన్స్ ఖర్చులు గరిష్టంగా రూ.2,000 పొందొచ్చు. ఆయుర్వేం, యునానీ, సిద్ధ, హోమియోపతి లాంటి ఇన్‌పేషెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతుంది. ముందే ఉన్న జబ్బులకు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత పాలసీ కవర్ అవుతుంది. అందుకే పాలసీ తీసుకునే ముందే గతంలో ఉన్న జబ్బుల వివరాలన్నీ సరిగ్గా వెల్లడించాలి. ఇక మిగతా పాలసీల్లాగా 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. జాయింట్ రీప్లేస్‌మెంట్‌కు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తించదు. ఇక ఆస్టియోఆర్థిరైటిస్, ఆస్టియోపోరోసిస్‌కు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే

ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీలో కో-పేమెంట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చుల్లో 5% పాలసీహోల్డర్ చెల్లించాలి. 95% ఇన్స్యూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు పాలసీహోల్డర్ ఆస్పత్రిలో చేరితే చికిత్స మొత్తానికి రూ.1,00,000 ఖర్చయితే పాలసీదారుడు రూ.5,000 చెల్లించాలి. రూ.95,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. 30 రోజుల ముందు ప్రీ-హాస్పిటలైజేషన్, 60 రోజుల పోస్ట్ హాస్పటలైజేషన్ ఖర్చుల్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 7, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading