SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...

SBI Flexi Deposit | కస్టమర్ల అనుకూలతను బట్టి డిపాజిట్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్‌లో కస్టమర్లు తమకు నచ్చిన అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేయొచ్చు.

news18-telugu
Updated: May 7, 2019, 6:20 PM IST
SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...
SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఫిక్స్‌డ్ డిపాజిట్... మీరు సేవింగ్స్ చేయాలనుకునే డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌కు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ పూర్తయ్యేవరకు డబ్బులు డ్రా చేయలేరు. ఇక నెలనెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.1,000 డిపాజిట్ చేస్తామని అకౌంట్ తెరిస్తే నెలనెలా అంతే మొత్తం డిపాజిట్ చేయాలి. ఇలా కాకుండా మీ దగ్గర ఎంత ఉంటే అంత డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్. ఇదీ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ లాంటిదే. కాకపోతే కొన్ని తేడాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.

Read this: LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు

కస్టమర్ల అనుకూలతను బట్టి డిపాజిట్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్‌లో కస్టమర్లు తమకు నచ్చిన అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఏడాదికి ఎంత డిపాజిట్ చేస్తామని ముందే ఒప్పుకుంటారో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్‌లో కనీసం నెలకు రూ.500 డిపాజిట్ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి రూ.50,000. వార్షిక డిపాజిట్‌ను 10 నెలల్లో అడ్జెస్ట్ చేస్తే చాలు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు గడువును ఎంచుకోవచ్చు.

Read this: SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

టర్మ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ వస్తుందో SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్‌పై అంతే వడ్డీ వస్తుంది. త్రైమాసికానికి చక్రవడ్డీ లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ కాస్త ఎక్కువగా వస్తుంది. ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌లో ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే అరశాతం వడ్డీ తక్కువగా వస్తుంది. లోన్ సదుపాయం కూడా ఉంటుంది.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3
ఇవి కూడా చదవండి:

ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...
First published: May 7, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading