హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌ అదిరింది.. చేరినోళ్ల పంట పండినట్లే.. సెప్టెంబర్ 21 వరకే అందుబాటులో!

SBI Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌ అదిరింది.. చేరినోళ్ల పంట పండినట్లే.. సెప్టెంబర్ 21 వరకే అందుబాటులో!

 ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌ అదిరింది.. చేరినోళ్ల పంట పండినట్లే.. సెప్టెంబర్ 21 వరకే అందుబాటులో!

ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌ అదిరింది.. చేరినోళ్ల పంట పండినట్లే.. సెప్టెంబర్ 21 వరకే అందుబాటులో!

SBI News | ఎస్‌బీఐ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా కొత్త ఎఫ్ఎంపీ స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ రాబడి పొందాలని భావించే వారు ఇందులో చేరొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  SBI Mutual Fund | దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌ తాజాగా కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పేరు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ (ఎఫ్ఎంపీ) సిరీస్ 68. దీని మెచ్యూరిటీ కాలం 1302 రోజులు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా డెట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, పీఎస్‌యూ, కార్పొరేటు బాండ్లు, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఈ స్కీమ్‌ 2026 ఏప్రిల్ నెలలో మెచ్యూరిటీకి వస్తుంది. ఈ ఫండ్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 21 వరకు ఇది అందుబాటులో ఉండనుంది.

  అంటే ఇన్వెస్టర్లు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. డబ్బులు మెచ్యూరిటీ కన్నా ముందుగా విత్‌డ్రా చేసుకోడం కుదరదు. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో డబ్బులు లాక్ చేసి పెట్టుకోవాలని భావించే వారికి ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది. కనీస వడ్డీ రేటు రిస్క్‌తో ఆకర్షణీయ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ పొందాలని భావించే వారికి ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ రాబడి పొందాలని భావించే వారు వీటిల్లో డబ్బులు పెడుతుంటారు.

  లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే! ధరల భారీ తగ్గింపు!

  ఎఫ్ఎంపీలు అనేది డెట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇందుకు కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, టీ బిల్స్, రెపో అండ్ రివర్స్ రెపో ఇన్‌స్ట్రుమెంట్స్, నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్ వంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్రెడిట్ రిస్క్, డిఫాల్ట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ను అలాగే కొనసాగించడం వల్ల వడ్డీ రేటు తగ్గుదల రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

  పండుగ సీజన్ ముంగిట.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!

  ఇకపోతే ఎఫ్ఎంపీల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను పాక్షికంగా పొందొచ్చు. ఎఫ్ఎంపీల్లో 36 నెలకు పైగా ఇన్వెస్ట్‌మెంట్లను కలిగి ఉంటే.. వాటిని దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్లుగా పేర్కొంటారు. అందుకే వీటిపై ఇండెక్సేషన్‌తో కలుపుకొని 20 శాతం ట్యాక్స్ పడుతుంది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. డబ్బులు పెట్టడానికి ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Mutual Funds, Personal Finance, Sbi, State bank of india

  ఉత్తమ కథలు