ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు కస్టమర్లపై హోమ్ లోన్ (Home Loan), పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఈఎంఐల (EMI) భారాన్ని మోపాయి. ఆర్బీఐ (RBI) వరుసగా రెపోరేటు పెంచుతూ రావడంతో.. బ్యాంకుల లోన్లపై ప్రభావం కనిపించింది. సాధారణ ప్రజలు హోమ్ లోన్లు తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. గతంలో కంటే హోమ్ లోన్ వడ్డీలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బీఐ హోమ్ లోన్ ఫెస్టివ్ ఆఫర్ కింద వివిధ రకాల గృహ రుణాలపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ 4న ప్రారంభమైన ఈ స్కీమ్ 2023 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్‌ను ఎస్బీఐ అందిస్తోంది. స్టాండర్డ్ హోమ్లోన్స్, టాప్-అప్ లోన్ల ప్రాసెసింగ్ ఛార్జీలను బ్యాంక్ మాఫీ చేసింది. ఎస్బీఐ గృహ రుణాల వడ్డీ రేట్లు కస్టమర్ల CIBIL స్కోర్ ఆధారంగా మారుతాయని గుర్తించాలి. క్రెడిట్ స్కోర్ మెరుగుపడినప్పుడు హోమ్‌లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.
స్టాండర్డ్ హోమ్ లోన్స్
ఎస్బీఐ ఆఫర్లో భాగంగా.. 800 క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి స్టాండర్డ్ హోమ్‌లోన్ వడ్డీ రేటు 8.55 శాతాన్ని 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 750, 799 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్న కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ అందిస్తోంది. వీరికి 8.65 నుంచి వడ్డీ రేటు 8.40 శాతానికి తగ్గుతుంది. 700- 749 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి 20 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్‌తో వడ్డీ రేటు 8.75 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుతం ఫ్లోర్ రేట్, EBR మధ్య వ్యత్యాసం 15 బేసిస్ పాయింట్లు. ప్రస్తుతం ఈబీఆర్ 8.55 శాతంగా ఉంది.700 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న కస్టమర్లకు వడ్డీ రేట్లు తగ్గవు. 650- 699 మధ్య ఉంటే 8.85 శాతం, 550- 649 మధ్య స్కోర్లకు 9.5 శాతం వడ్డీ ఉంటుంది. NTC/NO CIBIL/-1 కస్టమర్లకు 8.75 శాతం వడ్డీతో హోమ్ లోన్ లభిస్తుంది. మహిళా రుణగ్రహీతలు, ప్రివిలేజ్, శౌర్య, అపోన్ ఘర్ శాలరీ అకౌంట్స్ ఉన్నవారికి తగ్గింపు రేట్లలో అదనంగా 5 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ ఉంటుంది.
HDFC Rate Hike: హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు భారీ షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
టాప్-అప్ హోమ్ లోన్స్
టాప్-అప్ లోన్ల కింద.. ఎస్బీఐ కస్టమర్లకు 700- 800 మధ్య క్రెడిట్ రేటింగ్‌లకు 15 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ అందిస్తోంది. ఇండస్ట్రీ బెంచ్‌మార్క్ అయిన 8.95 శాతం కాకుండా, ఎస్బీఐ 800 కంటే ఎక్కువ లేదా సమానమైన క్రెడిట్ స్కోర్లకు 8.80 శాతం వడ్డీని, 750- 799 మధ్య ఉంటే 8.90 శాతం, 700- 749 మధ్య స్కోర్లకు 9 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అదే విధంగా 650- 699 స్కోర్లకు, 550- 649 స్కోర్లు ఉండేవారికి, NTC/NO CIBIL/-1కి వరుసగా 9.25 శాతం, 9.55 శాతం, 9.15 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
ప్రాపర్టీపై లోన్
నిర్దిష్ట క్రెడిట్ స్కోర్లపై, ప్రాపర్టీలను తనఖా పెట్టి హోమ్ లోన్ తీసుకొనే వారికి 30 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ అందుతుంది. 800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న వారికి 10.30 శాతం వడ్డీ 10 శాతానికి తగ్గుతుంది. 750–799 స్కోర్లు ఉన్న వారికి 10.40 శాతం వడ్డీ 10.10కి తగ్గుతుంది. 700–749 స్కోర్లతో ఉన్నవారు 10.50 శాతంతో పోలిస్తే 10.20 శాతానికే లోన్ పొందవచ్చు. 700 కంటే తక్కువ సిబిల్ ఉన్నవారికి డిస్కౌంట్లు వర్తించవు. 650- 699 మధ్య స్కోర్లకు 10.60 శాతం, 550- 649 మధ్య స్కోర్లకు 10.70 శాతం, NTC/NO CIBIL/-1కి 10.50 శాతం రేటును బ్యాంక్ వసూలు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loans, Sbi, Sbi loans