SBI FD RATES VS POST OFFICE WHERE WILL YOU GET BETTER RETURNS GH VB
Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై పోస్టాఫీస్, ఎస్బీఐ బెస్ట్ వడ్డీ రేట్లు.. వేటిని ఎంచుకోవడం మంచిదంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
FDలకు సంబంధించి పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంకులు అందిస్తున్న ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం. దీంతో మీరు దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో తెలుసుకోవచ్చు.
మధ్యతరగతి కుటుంబాలు చాలా కాలం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposits) రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. తక్కువ వడ్డీ రాబడి వచ్చినప్పటికీ రిస్క్ ఉండదు. దీంతో మధ్యతరగతి కుటుంబాలు FDలలో పెట్టుబడి పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కస్టమర్లు(Customers) తమ అవసరాల మేరకు స్వల్ప కాలం లేదా దీర్ఘకాలం FDలలో పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకులే కాకుండా పోస్టాఫీసులు కస్టమర్లకు FD సౌకర్యాలను కల్పిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్లను(Interest Rates) అందిస్తున్నాయి. అయితే మార్కెట్ల స్థితిగతులు, ప్రభుత్వ విధానాలను బట్టి ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్లు మారుతు ఉంటాయి.
టర్మ్ స్కీమ్స్‌ల్లో రిస్క్ లేని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఎస్బీఐ మరో ప్రాధాన్యత ఎంపికగా మారింది. పెట్టుబడి అవసరాన్ని బట్టి కనీసం 7 రోజుల వ్యవధి నుంచి 10 ఏళ్ల లాంగ్ టర్మ్ FDలను ఆఫర్ చేస్తోంది స్టేట్ బ్యాంకు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ గుర్తింపు పొందడంతో పెట్టుబడిదారుల్లో గొప్పనమ్మకన్నా చూరగొంది. దీంతో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి మొదటి ఎంపికగా ఎస్బీఐ మారింది. FDలకు సంబంధించి పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంకులు అందిస్తున్న ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం. దీంతో మీరు దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో తెలుసుకోవచ్చు.
పోస్టాఫీస్ FD వడ్డీ రేట్లు
సాధారణంగా పోస్టాఫీసులు అందించే FD రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంటారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు వడ్డీ రేట్లలో మార్పులు ఉండవు. ఓ ఏడాది FD స్కీమ్‌పై పోస్టాఫీసులు 5.5 శాతం ప్రారంభ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. దీనిపై రాబడి రేట్ 6.7 శాతం వరకు పెరుగుతుంది. పోస్టాఫీసుల్లో స్వల్ప, దీర్ఘకాలానికి సంబంధించి FDలపై వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి. ఒక సంవత్సరానికి సంబంధించి FD రేటు 5.5 శాతంగా ఉంది. 2 సంవత్సరాల వ్యవధి కలిగిన FDలపై వడ్డీ రేటు 5.5 శాతం అందిస్తుంది. మూడేళ్ళ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా 5.5 శాతం వడ్డీని అందిస్తుంది. ఇక 5 ఏళ్ల కాల వ్యవధికి సంబంధించిన FDలపై వడ్డీరేటు 6.7 శాతాన్ని పోస్టాఫీసులు ఆఫర్ చేస్తున్నాయి.
స్టేట్ బ్యాంకు FD వడ్డీ రేట్లు
పోస్టాఫీస్ FD స్కీమ్స్‌తో పోల్చుకుంటే ఎస్బీఐ అందించే FD స్కీమ్స్‌లో పెట్టుబడిపెట్టడానికి మరింత అనువుగా ఉన్నాయి. పోస్టాఫీస్ FD కనీస కాల వ్యవధి ఒక సంవత్సరం అయితే అదే ఎస్బీఐ కనిష్టంగా ఏడు రోజుల వ్యవధి ఉన్న FDలను ఆఫర్ చేస్తోంది. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన ఎస్బీఐ అందించే వడ్డీ రేటు డిపాజిట్ సోమ్ము, FD టెన్యూర్ ఆధారంగా 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మారుతూ ఉంటుంది.
స్టేట్ బ్యాంకు అందించే వడ్డీ రేటు వివరాలు ఇలా
7 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న FDలపై 2.9 శాతం వడ్డీ రేట్‌ను అందిస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న FDలపై 3.9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 180 రోజుల నుంచి 210 రోజుల మధ్య అయితే 4.4 శాతం, 211 రోజుల నుంచి ఒక సంవత్సరంలోపు అయితే 4.4 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది.
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి FDలపై రాబడి రేటు 5 శాతం కాగా, 3 సంవత్సరాల కంటే తక్కువ లాక్-ఇన్ పీరియడ్ ఉన్న FDకి వడ్డీరేటు 5.1 శాతం వరకు ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు లాక్-ఇన్ ఉన్న అన్ని FDలకు, వడ్డీరేటు 5.3 శాతం ఆఫర్ చేస్తోంది. అదే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు రాబడి రేటు 5.4 శాతంగా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.