SBI FD INTEREST RATES APRIL 2021 STATE BANK OF INDIA OFFERS MORE THAN 6 PER CENT INTEREST ON FIXED DEPOSITS SS
SBI: ఎస్బీఐలో మీ డబ్బులు ఉన్నాయా? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే
SBI: ఎస్బీఐలో మీ డబ్బులు ఉన్నాయా? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
SBI FD Interest Rates April 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. లేటెస్ట్ వడ్డీ రేట్లు తెలుసుకోండి.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా? మరి ప్రతీ నెల వడ్డీ రేట్లు చెక్ చేసుకుంటున్నారా? బ్యాంకులు ప్రతీ నెల వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. వడ్డీ రేట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒక్కోసారి పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తుంటాయి బ్యాంకులు. అందుకే ప్రతీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నవాళ్లు వడ్డీ రేట్లను చెక్ చేస్తూ ఉండాలి. ఎస్బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఎంచుకున్న కాలాన్ని బట్టి వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం వడ్డీ ఎక్కువ వస్తుంది. ఈ వడ్డీని నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పొందొచ్చు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/ లో తాజా వడ్డీ రేట్లను తెలుసుకోవచ్చు. మరి ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఉన్న లేటెస్ట్ వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.
SBI Latest FD Rates: ఎస్బీఐలో ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే...
7 రోజుల నుంచి 45 రోజులు- 2.9 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు- 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.4 శాతం
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4 శాతం
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4 శాతం
SBI Latest FD Rates for Senior Citizens: ఎస్బీఐలో సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే...
ఎస్బీఐలో సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. అంటే సాధారణ ప్రజలకు లభించే వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ అదనంగా పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు కూడా 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు అన్ని కాలవ్యవధులకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వృద్ధులకు 3.4 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మరి సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐలో వేర్వేరు కాలవ్యవధులకు ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసుకోండి.
7 రోజుల నుంచి 45 రోజులు- 3.4 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు- 4.4 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.9 శాతం
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9 శాతం
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.5 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.6 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.8 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2 శాతం
ఇక సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐలో ప్రత్యేకం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. 'ఎస్బీఐ వీకేర్' పేరుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో చేరడానికి 2021 జూన్ 30 వరకు గడువు ఉంది. సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ కన్నా అదనంగా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభించడం ఈ స్కీమ్ ప్రత్యేకత.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.