Home /News /business /

SBI ELITE CREDIT CARD TO AXIS MY ZONE CREDIT CARD THESE CREDIT CARDS OFFERS FREE MOVIE TICKETS DISCOUNTS AND CASHBACKS SS

Credit Cards: సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? ఈ క్రెడిట్ కార్డ్స్ మీకోసమే

Credit Cards: సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? ఈ క్రెడిట్ కార్డ్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Credit Cards: సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? ఈ క్రెడిట్ కార్డ్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Credit Cards | ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే మంచి డిస్కౌంట్ ఇచ్చే క్రెడిట్ కార్డులు చాలానే ఉన్నాయి. సినిమా టికెట్లు బుక్ (Cinema Ticket Booking) చేసినా డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. అంతేకాదు... కొన్ని క్రెడిట్ కార్డులు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తాయి.

ఇంకా చదవండి ...
మీరు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? మీకోసం ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్స్ (Credit Cards) ఉన్నాయి. బ్యాంకులు వేర్వేరు వర్గాలకు, వేర్వేరు అవసరాలకు ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్స్ రూపొందిస్తుంటాయి. అలాగే సినిమాలు ఎక్కువగా వెళ్లేవారి కోసం డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో సినిమా లవర్స్‌కి క్రెడిట్ కార్డుల్ని ఇస్తున్నాయి. వేసవిలో వరుసగా పెద్దపెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 (KGF 2), ఆచార్య, సర్కారువారి పాట... ఇలా అన్నీ పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు మొదటివారంలో వెళ్లాలంటే కాస్త బడ్జెట్ ఎక్కువగానే ఉండాలి. అయితే బ్యాంకులు ఇచ్చే ప్రత్యేకమైన క్రెడిట్ కార్డులతో ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా పొందొచ్చు. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఆ కార్డులు ఏవో, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

Kotak Delight Platinum Credit Card: కొటక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మూవీ టికెట్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీల్లో రూ.10,000 కన్నా ఎక్కువ ఖర్చు చేసేవారికే ఈ ఆఫర్స్ ఉన్నాయి. నాలుగు పీవీఆర్ టికెట్స్ ఉచితం. లేదా ఏటా రూ.1,25,000 ఖర్చు చేస్తే రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. యాన్యువల్ ఫీజు రూ.299.

Aadhaar Card: స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Axis My Zone Credit Card: యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పేటీఎం మూవీస్‌లో రెండో సినిమా టికెట్‌పై 100 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సోనీలివ్ ప్రీమియం యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఆజియోలో రూ.2,000 బిల్ చేస్తే రూ.600 తగ్గింపు లభిస్తుంది. పార్ట్‌నర్ రెస్టారెంట్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. మూవీ టికెట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీల్లో ఆఫర్స్ లభిస్తాయి. యాన్యువల్ ఫీజు రూ.500.

PVR Kotak Platinum Credit Card: పీవీఆర్ కొటక్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటే నెలకు రూ.10,000 కన్నా ఎక్కువ ఖర్చు చేసినవారికి ఉచితంగా రెండు సినిమా టికెట్లు లభిస్తాయి. పీవీఆర్ బాక్స్ ఆఫీస్ సినిమా టికెట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పీవీఆర్‌లో ఫుడ్, డ్రింక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. యాన్యువల్ ఫీజు రూ.999.

HDFC Bank Platinum Times Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డుతో బుక్ మై షోలో సినిమా టికెట్స్ బుక్ చేస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రతీ ట్రాన్సాక్షన్‌పై రూ.350 తగ్గింపు పొందొచ్చు. వీక్‌డేలో డైనింగ్ బిల్స్‌పై ప్రతీ రూ.150 కి 10 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇతర కేటగిరీల్లో ప్రతీ రూ.150 కి 3 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. యాన్యువల్ ఫీజు రూ.1,000. ఏటా రూ.2,50,000 ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.

Tirupati Tour: శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ

SBI Elite Credit Card: ఎస్‌బీఐ ఎలైట్ కార్డుపై ప్రతీ ఏటా రూ.6,000 విలైవన కాంప్లిమెంటరీ మూవీ టికెట్స్ లభిస్తాయి. డైనింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, గ్రాసరీ బిల్స్‌పై 5 రెట్లు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్ లభిస్తుంది. ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో ఆరు సార్లు లాంజ్ యాక్సెస్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల్లో రెండుసార్లు లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. యాన్యువల్ ఫీజు రూ.4,999.

అయితే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఎక్కువగా వాడేస్తే చిక్కులు తప్పవు. క్రెడిట్ కార్డ్ బిల్ గడువులోగా చెల్లించకపోతే 28 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Cinema, Credit cards, Movie

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు