Education Loan | దేశీ కేంద్ర బ్యాంక్ ఎస్‌బీఐ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో రుణాలు కూడా ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ (SBI) వివిధ రకాల లోన్స్ (Loan) ఆఫర్ చేస్తోంది. వీటిల్లో పర్సనల్ లోన్స్ దగ్గరి నుంచి పెన్షన్ లోన్స్ వరకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుకుందాం. అర్హత కలిగిన వారు ఎస్‌బీఐ నుంచి ఈజీగానే విద్యా రుణం పొందొచ్చు. ఏకంగా రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.
ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్‌ను 15 ఏళ్లలోగా తిరిగి చెల్లించొచ్చు. కోర్సు అయిపోయిన తర్వాత, 12 నెలల రీపేమెంట్ హాలిడే తర్వాత నుంచి ఈ టెన్యూర్ ప్రారంభం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. రూ. 20 లక్షల వరకు రుణానికి ఇది వర్తిస్తుంది. అదే రూ. 20 లక్షలకు పైన లోన్ అయితే రూ. 10 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. సెక్యూరిటీగా తల్లిదండ్రులు సహ రుణదారుగా ఉండాలి. ఎలాంటి తనఖా అవసరం లేదు. రూ. 7.5 లక్షల వరకు అయితే ఇది వర్తిస్తుంది. ఆపైన మొత్తం అయితే తనఖా అవసరం అవుతుంది.
అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ .. రూ.500తో బుక్ చేసుకోండిలా!
రూ. లక్షల వరకు లోన్ అయితే మార్జిన్ అవసరం లేదు. ఆపైన అమౌంట్ అయితే 5 శాతం మార్జిన్ ఉంటుంది. దేశంలో చదువుకుంటే ఇది వర్తిస్తుంది. విదేశీ విద్య అయితే 15 శాతం మార్జిన్ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం రెండో లోన్ తీసుకొని ఉంటే.. అప్పుడు కూడా 15 ఏళ్లలోపు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
ఉచితంగానే క్రెడిట్ కార్డు.. తీసుకుంటే ఫ్రీగా రూ.5 లక్షల బెనిఫిట్, ఏడాదికి రూ.10 వేలు ఆదా!
దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలని భావించే భారతీయ పౌరులు అందరూ బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. గ్రాడ్యుయేషన్ దగ్గరి నుంచి ఐఐటీ, ఐఐఎం వరకు చాలా కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. డిగ్రీ, డిప్లొమా కోర్సులకు కూడా లోన్ వర్తిస్తుంది. దేశంలో చదవడానికి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు లోన్ ఇస్తారు.
అదే విదేశాల్లో చదవడానికి అయితే గరిష్టంగా రూ. 1.5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. మెడికల్ కోర్సులకు రూ. 30 లక్షల లోన్ వస్తుంది. ఇతర కోర్సులకు రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. టూవీలర్ కాస్ట్, ట్రావెల్ ఎక్స్‌పెన్స్, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్, రిఫండబుల్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, బుక్స్ ఎక్విప్‌మెంట్ వంటి కొనుగోలు, ఎగ్జామినేషన్ లేదా లైబ్రెరీ లేదా ల్యాబొరేటరీ ఫీజు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు వంటివి అన్నీ లోన్ కింద కవర్ అవుతాయి. మార్క్ షీట్స్, అడ్మిషన్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డు, ఫోటోలు వంటి పలు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, Education Loan, Sbi, State bank of india