SBI Mudra Loan | దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు వివిధ రకాల రుణాలు (Loan) అందిస్తోంది. పర్సనల్ లోన్స్ దగ్గరి నుంచి హోమ్ లోన్స్ వరకు పలు రకాల రుణాలు జారీ చేస్తోంది. వీటిల్లో బిజినెస్ లోన్స్ కూడా ఉంటాయి. ఎస్‌బీఐ వ్యాపారులకు పలు రకాల రుణాలు అందిస్తోంది. వీటిల్లో ఎస్‌బీఐ ఇ ముద్రా లోన్ కూడా ఒకటి. స్టేట్ బ్యాంక్ ఈ ఇముద్రా స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి రూ.లక్ష వరకు రుణం మంజూరు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.
ఎస్‌బీఐ ఇ ముద్రా స్కీమ్ కింద లోన్ పొందాలని భావించే వారు కచ్చితంగా మైక్రో ఎంట్రప్రెన్యూర్ అయ్యి ఉండాలి. అంటే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎస్‌బీఐ వద్ద కరెంట్ అకౌంట్ లేదంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. గరిష్టంగా ఈ స్కీమ్ కింద రూ. లక్ష వరకు రుణం మంజూరు చేస్తారు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ అర్హత ప్రమాణాల ప్రకారం.. అర్హత కలిగిన వారికి తక్షణమే రూ.50 వేల రుణం లభిస్తుంది. ఆన్‌లైన్‌లోనే ఈ మొత్తం పొందొచ్చు.
యమ క్రేజ్.. జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 5 కార్లు ఇవే!
అయితే రూ. 50 వేలకు మించి లోన్ పొందాలని భావిస్తే.. మాత్రం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తుంది. అలాగే లోన్ పొందాలని భావించే వారు బిజినెస్ ప్రూఫ్ కలిగి ఉండాలి. పేరు, ఎప్పుడు ప్రారంభించింది, అడ్రస్ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. కమ్యూనిటీ వివరాలు అంటే కాస్ట్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా జీఎస్‌టీఎన్, ఉద్యోగ్ ఆధార్ వంటి వివరాలు కావాలి. బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది.
ఈ ప్రభుత్వ స్కీమ్‌తో బ్యాంక్ నుంచి రూ.10 లక్షల రుణం.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండిలా!
ఎస్‌బీఐ ఇ ముద్రా వెబ్‌సైట్‌లోకి వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ కావాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంత మొత్తం అవసరమో ఎంటర్ చేయాలి. తర్వాత ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. ఇంకా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వ్యాపారులు సులభంగానే రూ.లక్ష వరకు రుణం పొందొచ్చు. డబ్బులతో అత్యవసరం పడిన వారు ఈ లోన్ స్కీమ్ కింద రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Sbi, Sbi loans, State bank of india