news18-telugu
Updated: October 24, 2019, 11:20 AM IST
SBI Diwali Offer: మీ దగ్గర ఎస్బీఐ అకౌంట్ ఉందా? దీపావళికి రూ.15,000 బెనిఫిట్స్
(ప్రతీకాత్మక చిత్రం)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దీపావళి సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యోనో యాప్ ఉపయోగించేవారు ఈ ఆఫర్లను పొందొచ్చు. దీపావళి పండుగ సెలవుల్లో ఊళ్లకు, టూర్లకు వెళ్లాలనుకునేవారి కోసం ఈ ఆఫర్స్ ప్రకటించింది ఎస్బీఐ. క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, యాత్ర, ట్రావెల్ యారీ, రెడ్ బస్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఎస్బీఐ... యోనో యూజర్లకు ఈ ఆఫర్లను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఆఫర్లను 2019 డిసెంబర్ 31 వరకు ఉపయోగించుకోవచ్చు. క్లియర్ ట్రిప్‌లో డొమెస్టిక్ రౌండ్ ట్రిప్ ఫ్లైట్ బుకింగ్స్‌పై 20% రూ.1,000 వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. డొమెస్టిక్ హోటల్ రిజర్వేషన్లపై రూ.10,000 వరకు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇక ఈజ్ మై ట్రిప్ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కనీసం రూ.2,000 ఫ్లైట్ బుకింగ్‌పై రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు. హోటల్ బుకింగ్స్‌పై రూ.700 వరకు, బస్ బుకింగ్‌పై 5% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక యాత్రలో ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు. హోటల్ బుకింగ్స్‌పై 20% రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఆన్లైన్ బస్ బుకింగ్ పోర్టల్ ట్రావెల్ యారీలో బస్ టికెట్లు బుక్ చేస్తే 10% రూ.120 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక రెడ్ బస్‌లో బస్ టికెట్లు బుక్ చేస్తే 5% తగ్గింపు లభిస్తుంది.
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
LIC: పేటీఎం యాప్‌లో ఎల్ఐసీ ప్రీమియం కట్టండి ఇలా
Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే...
Tirumala Darshanam Tickets: తిరుమలలో 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్లు బుక్ చేయండి ఇలా
Published by:
Santhosh Kumar S
First published:
October 24, 2019, 11:20 AM IST