హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Debit Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పోయిందా? ఇలా బ్లాక్ చేసి కొత్త కార్డు పొందొచ్చు

SBI Debit Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పోయిందా? ఇలా బ్లాక్ చేసి కొత్త కార్డు పొందొచ్చు

SBI Debit Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పోయిందా? ఇలా బ్లాక్ చేసి కొత్త కార్డు పొందొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పోయిందా? ఇలా బ్లాక్ చేసి కొత్త కార్డు పొందొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card | మీరు మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డును బ్లాక్ చేసి కొత్త డెబిట్ కార్డ్ పొందాలనుకుంటున్నారా? ఒక్క ఫోన్ కాల్‌తో మీ కార్డు బ్లాక్ (SBI ATM Card Block) చేయడం మాత్రమే కాదు కొత్త కార్డుకు అప్లై చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? మీరు ఎస్‌బీఐ ఏటీఎం కార్డు వాడుతున్నారా? మీరు ఎప్పుడైనా ఎస్‌బీఐ ఏటీఎం కార్డు (SBI ATM Card) పోగొట్టుకుంటే చాలా సింపుల్‌గా బ్లాక్ చేయొచ్చు. ఏటీఎం కార్డు పోతే కస్టమర్లు కంగారుపడిపోతుంటారు. ఏటీఎం కార్డు పోయినట్టు మీరు నిర్ధారణకు వచ్చినట్టైతే వెంటనే బ్లాక్ చేయడం తప్పనిసరి. ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVR System) ద్వారా సులువుగా కార్డ్ బ్లాక్ చేయొచ్చు. కొత్త కార్డుకు అప్లై చేయొచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ 1800 1234 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఆపరేట్ చేస్తోంది. మరి ఏటీఎం కార్డు ఎలా బ్లాక్ చేయాలి? కొత్త డెబిట్ కార్డు ఎలా పొందాలో తెలుసుకోండి.

  ఎస్‌బీఐ ఏటీఎం కార్డు బ్లాక్ చేయండిలా

  మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు బ్లాక్ చేయడానికి ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800 1234 నెంబర్ డయల్ చేయాలి.

  కార్డ్ బ్లాక్ చేయడానికి 0 ప్రెస్ చేయాలి.

  కార్డ్ బ్లాక్ చేయడానికి 1 ప్రెస్ చేయాలి.

  మీ ఏటీఎం కార్డు చివరి 5 అంకెల్ని ప్రెస్ చేయాలి.

  కన్ఫామ్ చేయడానికి 1 ప్రెస్ చేయండి

  ఏటీఎం కార్డు చివరి 5 అంకెల్ని మళ్లీ ఎంటర్ చేయడానికి 2 ప్రెస్ చేయాలి.

  మీ కార్డు విజయవంతంగా బ్లాక్ అవుతుంది.

  మీ కార్డు బ్లాక్ అయినట్టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  PM Kisan Scheme: రైతులకు అలర్ట్... వీరికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు

  ఒకవేళ మీ అకౌంట్ నెంబర్ ఉపయోగించి కార్డ్ బ్లాక్ చేయాలనుకుంటే 1 కాకుండా 2 ప్రెస్ చేయాలి.

  మీ అకౌంట్ నెంబర్‌లోని చివరి ఐదు అంకెల్ని ఎంటర్ చేయాలి.

  ఒకటి ప్రెస్ చేసి కన్ఫామ్ చేయాలి.

  మీ అకౌంట్ నెంబర్‌లోని చివరి ఐదు అంకెల్ని మళ్లీ ఎంటర్ చేయడానికి 2 ప్రెస్ చేయాలి.

  మీ కార్డు విజయవంతంగా బ్లాక్ అవుతుంది.

  మీ కార్డు బ్లాక్ అయినట్టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  UPI Payments: ఆధార్ కార్డు ఉందా? యూపీఐ ఇలా యాక్టివేట్ చేయండి

  కొత్త ఎస్‌బీఐ ఏటీఎం కార్డుకు అప్లై చేయండి ఇలా

  ఇక మీకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డు రీప్లేస్‌మెంట్ కావాలనుకుంటే 1 ప్రెస్ చేయండి.

  ముందటి మెనూలోకి వెళ్లడానికి 7 ప్రెస్ చేయండి.

  మెయిన్ మెనూలోకి వెళ్లడానికి 8 ప్రెస్ చేయండి.

  మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి.

  మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు డెబిట్ కార్డ్ కావాలనుకుంటే 1 ప్రెస్ చేసి కన్ఫామ్ చేయండి.

  లేకపోతే 2 ప్రెస్ చేసి క్యాన్సిల్ చేయండి.

  మీ కార్డు రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ సక్రెస్ అవుతుంది.

  కార్డ్ రీప్లేస్‌మెంట్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Atm Card, Personal Finance, Sbi card, State bank of india

  ఉత్తమ కథలు