SBI : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ... ప్రజలకు నష్టమే...

SBI : ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం మదుపుదారులకు ఇబ్బంది కరమైనదే. వడ్డీ వస్తుందని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మనీ దాచుకుంటే కష్టమే.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 8:01 AM IST
SBI : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ... ప్రజలకు నష్టమే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో అత్యధిక శాఖలున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ఇబ్బంది కలిగే నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంకులో లిక్విడిటీ పెరగడం, రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా... తాము వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు SBI తెలిపింది. ఆగస్ట్ 26 నుంచీ కొత్త వడ్డీ రేట్లు (తగ్గించినవి) అమల్లోకి వస్తాయని వివరించింది. మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే... ఇప్పటికే... ఇదే ఆగస్టు నెలలో 1న SBI... వడ్డీ రేట్లు తగ్గించింది. మళ్లీ నెల కూడా పూర్తవకుండానే మరోసారి కోత పెట్టింది. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా వస్తోంది. ఈ కోతలతో... ఇంకా తగ్గిపోతుంది. తాజా నిర్ణయం ప్రకారం... 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5శాతం అందిస్తున్న వడ్డీని 4.5 శాతానికి తగ్గించింది SBI. అలాగే... 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీలో... 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.5 శాతంగా ఫిక్స్ చేసింది. 180 నుంచి ఏడాది లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించేసింది.

ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.80శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించింది SBI. 10 ఏళ్ల వరకు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25శాతానికి పరిమితం చేసింది.

ఇలాగైతే... ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల బదులు... ఈక్విటీ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టుకోవడం బెటరంటున్నారు మార్కెట్ నిపుణులు. ఐతే... షేర్లలో రిస్క్ ఉంటుంది కాబట్టి... జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు