ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్... ఎలాగో తెలుసుకోండి

10,000 ఎస్ఎంఎస్‌లు ఎంపిక చేసి రూ.50, రూ.100, రూ.150, రూ.200 క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఒక నెంబర్‌పై గరిష్టంగా రెండుసార్లు క్యాష్‌బ్యాక్(మొత్తం రూ.400) పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ నియమనిబంధనలు చదవండి.

news18-telugu
Updated: December 14, 2018, 8:30 AM IST
ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్... ఎలాగో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? అయితే ఉచితంగా ఐదు లీటర్ల పెట్రోల్ పొందొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది రూ.100 పెట్రోల్ కొనడమే. "భీమ్ ఎస్‌బీఐ పేతో ఇండియన్ ఆయిల్ రీటైల్ ఔట్‌లెట్‌లో పెట్రోల్ కొంటే... 5 లీటర్ల పెట్రోల్ ఉచితం. ఈ ఆఫర్ 15 డిసెంబర్ 2018 వరకు పొడిగించాం" అంటూ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. గతంలో ఈ ఆఫర్ నవంబర్ 23 వరకు మాత్రమే ఉండేది.

ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి...
మొదట ఇండియన్ ఆయిల్ రీటైల్ ఔట్‌లెట్‌లో పెట్రోల్ కొనాలి. భీమ్-యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి. మినిమమ్ ట్రాన్సాక్షన్ రూ.100 ఉండాలి.పెట్రోల్ కొన్న తర్వాత <UPI Reference No. (12-Digit)> <DDMM> అని టైప్ చేసి ఆ ఎస్ఎంఎస్‌‌ను 9222222084 నెంబర్‌కు పంపాలి. సాధారణ ఎస్ఎంఎస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఏవైనా సందేహాలు ఉంటే 1800 22 8888 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
కార్డు ద్వారా పేమెంట్ చేస్తే స్లిప్‌పైన ఉండే 6 అంకెల అప్రూవల్?ఆథెంటికేషన్ కోడ్‌ను ‘Approval/Authcode<space>DDMM’ అని టైప్ చేసి 9222222084 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
10,000 ఎస్ఎంఎస్‌లు ఎంపిక చేసి రూ.50, రూ.100, రూ.150, రూ.200 క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఒక నెంబర్‌పై గరిష్టంగా రెండుసార్లు క్యాష్‌బ్యాక్(మొత్తం రూ.400) పొందొచ్చు.
పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ నియమనిబంధనలు చదవండి.

ఇవి కూడా చదవండి:

ఎస్‌బీఐ కస్టమర్లకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ

2018 టాప్ మొబైల్ యాప్స్ ఇవే... మీ దగ్గరున్నాయా?

జనవరి 1 లోపే టీవీ, ఫ్రిజ్ కొనండి... 7-10% రేట్లు పెరుగుతున్నాయి

జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

 
First published: December 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు