SBI Card: ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది జాగ్రత్త

SBI Credit Card | క్రెడిట్ కార్డు ఎక్కడెక్కడ వాడకూడదో ఎప్పటికప్పుడు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. సోషల్ మీడియాతో పాటు ఇమెయిల్స్ ద్వారా అలర్ట్స్ పంపిస్తుంది.

news18-telugu
Updated: November 18, 2019, 1:10 PM IST
SBI Card: ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది జాగ్రత్త
SBI Card: ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడతారు జాగ్రత్త. అవసరానికి క్రెడిట్ కార్డు వాడుకోవడంలో తప్పులేదు. కానీ... క్రెడిట్ కార్డు ఎక్కడెక్కడ వాడుకోవచ్చో, ఎక్కడ వాడకూడదో స్పష్టమైన నియమనిబంధనలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈ నియమనిబంధనల్ని రూపొందించింది. మీకు క్రెడిట్ కార్డ్ జారీ చేయడానికి ముందే ఈ రూల్స్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు ఎక్కడెక్కడ వాడకూడదో ఎప్పటికప్పుడు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. సోషల్ మీడియాతో పాటు ఇమెయిల్స్ ద్వారా అలర్ట్స్ పంపిస్తుంది. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (FEMA) చట్టం ప్రకారం మీరు మీ క్రెడిట్ కార్డును కొన్ని లావాదేవీలకు అస్సలు వాడకూడదు. అవేంటో తెలుసుకోండి.

మీరు మీ క్రెడిట్ కార్డును లాటరీ టికెట్లు కొనడానికి వాడుతున్నారా? అయితే ఇబ్బందులు తప్పవు. అంతేకాదు... బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి లావాదేవీలకు వాడుతున్నారా? మీ కార్డును వీటికోసం అస్సలు వాడకూడదు. అంతేకాదు... ఫారెక్స్ ట్రేడింగ్, కాల్ బ్యాక్ సర్వీసెస్‌ కోసం కూడా మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించకూడదు. నిషేధం ఉన్న మ్యాగజైన్లను కొనడానికి కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు. చాలావరకు ఫారెక్స్ ట్రేడ్ మర్చెంట్లు, క్యాసినోలు, హోటళ్లు, వెబ్‌సైట్లు ఇలాంటి వాటి కోసం మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించమని కోరుతుంటాయి. కానీ మీరు మీ క్రెడిట్ కార్డుతో ఈ లావాదేవీలు జరిపారంటే సమస్యల్లో చిక్కుకుంటారు జాగ్రత్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులు మాత్రమే కాదు... అన్ని క్రెడిట్ కార్డులకూ ఇవే నియమ నిబంధనలు వర్తిస్తాయి.

Personal Finance: మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీSBI Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్... ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
Published by: Santhosh Kumar S
First published: November 18, 2019, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading