సాధారణంగా ప్రతీ క్రెడిట్ కార్డులో మూడు రకాల లిమిట్స్ కనిపిస్తాయి. టోటల్ క్రెడిట్ లిమిట్ అంటే మొత్తంగా మీకు ఎంత క్రెడిట్ లిమిట్ ఉందో తెలుస్తుంది. అవైలెబుల్ క్రెడిట్ లిమిట్ అంటే మీకు ఉన్న క్రెడిట్ లిమిట్లో మీరు అప్పటివరకు ఉపయోగించిన మొత్తం తీసేస్తే మిగిలినది. ఇక క్యాష్ లిమిట్. క్రెడిట్ కార్డుతో వస్తువులు కొనడం మాత్రమే కాదు డబ్బులు కూడా డ్రా చేయొచ్చు. కాకపోతే వడ్డీ చెల్లించాలి. క్రెడిట్ లిమిట్ ఎంత ఉంటే అంత క్యాష్ లిమిట్ ఉండదు. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.1,00,000 ఉంటే అందులో క్యాష్ లిమిట్ రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది. బ్యాంకును సంప్రదించి మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు.
ఒక్కోసారి బ్యాంకులే కాల్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచుతామని అడుగుతాయి. దీన్నే ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ అంటారు. ఇది బ్యాంకు ఇంటర్నల్ పాలసీ, మీ క్రెడిట్ హిస్టరీ, మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించిన విధానం, క్రెడిట్ స్కోర్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఆఫర్ కొందరికి మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన సమాచారం ఎస్ఎంఎస్, ఇమెయిల్ లేదా మంత్లీ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. మీ క్రెడిట్ కార్డుపై ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఆఫర్ ఉందేమో ఓసారి చెక్ చేయాలి. ఈ ఆఫర్ ఉంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఈజీగా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవచ్చు.
Money Transfer: మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? సోమవారం నుంచి కొత్త టైమింగ్స్
EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్... మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి
మీ ఆదాయం పెరిగినప్పుడు మీరు మీ క్రెడిట్ లిమిట్ పెంచమని కోరొచ్చు. ఇందుకోసం ఇన్కమ్ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. మీరు బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా ఇమెయిల్ రాసి మీ క్రెడిట్ లిమిట్ పెంచమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం మీ ఆదాయం పెరిగినట్టు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడ్‌తో) లేదా 1860 180 1290 నెంబర్లకు కాల్ చేయొచ్చు.
LPG Gas Cylinder: ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందండి ఇలా
SBI Alert: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ 5 తప్పులు చేయొద్దు
ప్రస్తుతం ఉన్న లిమిట్ సరిపోవట్లేదని అనిపిస్తే మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి. ఆఫర్ ఉంది కదా అని క్రెడిట్ లిమిట్ పెంచుకొని, ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఆ తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవచ్చు. మీ క్రెడిట్ లిమిట్లో యుటిలైజేషన్ రేషియో అంటే మీరు వాడుతున్న మొత్తం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.2,00,000 ఉంటే అందులో మీరు రూ.40,000 నుంచి రూ.60,000 మధ్యే ఉపయోగించాలి. యుటిలైజేషన్ రేషియో ఎంత తక్కువగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అంత బాగుంటుంది. మీ యూటిలైజేషన్ రేషియో ఎక్కువగా ఉందనిపిస్తే క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. దీని ద్వారా యుటిలైజేషన్ రేషియో తగ్గించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, Credit cards, Personal Finance, Sbi, Sbi card