SBI Credit Card | మీరు ఎస్బీఐ కస్టమరా? ఎస్బీఐ క్రెడిట్ కార్డు (Credit Card) వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. పలు రకాల బ్రాండ్లపై అదిరే క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు (SBI Offers) డిసెంబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ ఏ బ్రాండ్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హయర్ ప్రొడక్టులపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. గరిష్టంగా రూ. 12 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఐఎఫ్బీ ప్రొడక్టులపై కూడా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. గరిష్టంగా రూ. 5 వేల వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఎల్జీ ప్రొడక్టులపై అయితే 22.5 శాతం వరకు లేదంటే గరిష్టంగా రూ. 20 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. లాయిడ్ ప్రొడక్టులపై అయితే రూ. 4,500 వరకు క్యాష్ బ్యాంక్ వస్తుంది.
14 రోజులు సెలవులు.. డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే! ఏపీ, తెలంగాణలో మాత్రం..
ఇంకా శాంసంగ్ ప్రొడక్టులపై 27.5 శాతం వరకు లేదంటే గరిష్టంగా రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. టీసీఎల్ ప్రొడక్టులపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గింపు ఉంది. వర్ల్‌పూల్ ప్రొడక్టులపై గరిష్టంగా రూ. 7,500 వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఒప్పొ స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 4 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. వివో స్మార్ట్‌ఫోన్స్‌పై అయితే రూ. 8 వేల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
ఇయర్ఎండ్ ధమాకా ఆఫర్.. ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.10,000 డిస్కౌంట్, రూ.999తో బుక్ చేసుకోండిలా!
ఇక టూవీలర్ కొనుగోలుపై హీరో టూవీలర్లపై రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. మినిమమ్ ట్రాన్సాక్షన్ విలువ రూ. 20 వేలుగా ఉంది. ఈ ఆఫర్లు అన్నీ కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తాయి. డిసెంబర్ 31 వరకు ఆఫర్లు ఉంటాయి. అందవల్ల ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు నచ్చిన ఆఫర్‌ను ఎంచుకోవచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వారు ఈ ఆఫర్లను పొందొచ్చు. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై అదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. కాగా ఎస్బీఐ కార్డు ఇటీవలనే క్రెడిట్ కార్డుపై పలు చార్జీలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజును రూ.199కు పెంచేసింది. ఇదివరకు ఇది రూ.99గా ఉండేది. అలాగే అద్దె చెల్లింపులపై కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. రూ. 99 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. అంటే క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే వారిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Credit card, Sbi, Sbi card, State bank of india