అమెజాన్‌లో సెప్టెంబర్ 23న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival) ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card), ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ కార్డుపై ఆఫర్స్ మొదలయ్యాయి. ఎస్బీఐ కస్టమర్లు గరిష్టంగా రూ.10,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే మినిమమ్ ట్రాన్సాక్షన్ చేసినవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.10,750 వరకు డిస్కౌంట్ ఎలా పొందొచ్చో తెలుసుకోండి.
ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మొబైల్స్ కొనేవారు కనీసం రూ.5,000 ట్రాన్సాక్షన్ చేయాలి. గరిష్టంగా నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు రూ.1,250, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. గ్రాసరీ కొంటే కనీసం రూ.2,500 ట్రాన్సాక్షన్ చేయాలి. గరిష్టంగా నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు రూ.300 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇతర కేటగిరీల్లో వస్తువులు కొంటే కనీసం రూ.5,000 ట్రాన్సాక్షన్ చేయాలి. గరిష్టంగా నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు రూ.1,500, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు రూ.1,750 డిస్కౌంట్ లభిస్తుంది. ఒక కార్డుపై గరిష్టంగా రూ.1,750 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.
Big Billion Offer: ఈ 6 షావోమీ స్మార్ట్ఫోన్లపై రూ.7,000 వరకు డిస్కౌంట్
Get 10% Instant Discount* on select products on Kickstarter Deals with SBI Credit Card before the Amazon Great Indian Festival ‘22 begins!
Know more: https://t.co/dOh8Vav1C4 *T&C Apply#SBICard #AmazonGreatIndianFestival #Amazon #Cashback #Offers #Deals #PromoCode #Shopping pic.twitter.com/5sf51QDOWF — SBI Card (@SBICard_Connect) September 12, 2022
ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై బోనస్ ఆఫర్ కూడా ఉంది. సింగిల్ ట్రాన్సాక్షన్ రూ.30,000 దాటితే రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.50,000 దాటితే రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.75,000 దాటితే రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.1,00,000 దాటితే రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. కార్డుపైన వచ్చే 10 శాతం డిస్కౌంట్‌తో పాటు ఈ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. బోనస్ ఆఫర్‌తో కలిపి గరిష్టంగా మొత్తం రూ.10,750 డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ చెబుతోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇక అమెజాన్‌లో వచ్చేవారమే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతుంది. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ , సాంసంగ్, ఐకూ, షావోమీ లాంటి టాప్ బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌వాచెస్ లాంటి వాటిపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
Xiaomi 11i HyperCharge: ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయిన డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్ వివరాలివే
మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరగనుంది. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం, ప్రింటర్లు మానిటర్లపై 80 శాతం, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Credit cards, Sbi card