హోమ్ /వార్తలు /బిజినెస్ /

మరో విజయ్ మాల్యా.. ఆరు బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పరార్..

మరో విజయ్ మాల్యా.. ఆరు బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పరార్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రామ్ దేవ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రమోటర్స్ మీద ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, వాటిని తీర్చుకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా తరహాలో మరికొందరు వెలుగులోకి వచ్చారు. ఆరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయారు. దీంతో బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రామ్ దేవ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రమోటర్స్ మీద ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు నరేష్ కుమార్, సురేష్ కుమార్, సంగీత ఆరు బ్యాంకుల నుంచి రూ.411 కోట్ల రుణాలు తీసుకుని ఇప్పుడు విదేశాలకు పారిపోయారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ రామ్ దేవ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ భారత్ నుంచి బాస్మతీ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. కొన్ని పశ్చిమాసియా దేశాలు, ఐరోపా దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ ఎస్‌బీఐ నుంచే రూ.173 కోట్ల రుణాలు తీసుకుంది. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు తీసుకుంది.

రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థకు హర్యానాలోని కర్నాల్ జిల్లాలో మూడు రైస్ మిల్లులు ఉన్నాయి. 8 గ్రేడింగ్ యూనిట్లు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల కోసం సౌదీ అరేబియా, దుబాయ్‌లో కూడా ఆ కంపెనీ ఆఫీసులను ఏర్పాటు చేసుకుంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల సీబీఐ ఎలాంటి విచారణ ప్రస్తుతానికి చేయలేదని అధికారులు చెబుతున్నారు. మొదట నిందితులకు నోటీసులు జారీ చేస్తారని, ఆ తర్వాత నిందితుల స్పందనను బట్టి చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ నిందితులు విచారణకు హాజరుకాకపోతే అప్పుడు న్యాయపరంగా ముందుకు వెళ్తుంది సీబీఐ. ఎస్‌బీఐ ఫిర్యాదు ప్రకారం 2016 జనవరి 27 నుంచి రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ NPAగా మారింది. ప్రస్తుతం వారు దేశం విడిచి వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు.

First published:

Tags: Canara Bank, Central Bank of India, Corporation Bank, Idbi, Sbi, Union bank of india

ఉత్తమ కథలు