రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల్లో చెక్స్ క్లియరెన్స్ కోసం కొత్త రూల్స్ అమలు చేయాలని బ్యాంకులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.5,00,000 లేదా అంతకన్నా ఎక్కువ వ్యాల్యూ ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ (Positive Pay System) పాటించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా బ్యాంకులన్నీ ఈ రూల్ పాయించాల్సిందే. రూ.5,00,000 లోపు చెక్స్‌కి కూడా ఈ రూల్ పాటించవచ్చు. కానీ ఇది తప్పనిసరి కాదు. కానీ రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్స్‌కి మాత్రం పాజిటీవ్ పే సిస్టమ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పాజిటీవ్ పే సిస్టమ్‌ను రూపొందించింది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకు ఓ కస్టమర్ ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇచ్చారనుకుందాం. ఆ చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంకు సిబ్బంది దగ్గరకు వెళ్లినప్పుడు వెంటనే చెక్ ఎన్‌క్యాష్ చేయకుండా కస్టమర్ నుంచి చెక్‌పైన ఉన్న వివరాలను నిర్థారించుకుంటారు. అయితే అంతకన్నా ముందే కస్టమర్ ఆ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా బ్యాంకుకు వెల్లడించాల్సి ఉంటుంది. చెక్ పైన ఉన్న వివరాలు, కస్టమర్ ఇచ్చిన వివరాలు మ్యాచ్ అయితేనే చెక్ క్లియర్ అవుతుంది. లేకపోతే బ్యాంకు ఆ చెక్‌ను తిరస్కరిస్తుంది.
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి
ఆర్‌బీఐ పాజిటీవ్ పే సిస్టమ్‌ను 2021 జనవరి 1న అమలు చేస్తూ రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ విధానం పాటించాలని సూచించింది. ఇది తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ రూల్ పాటించాల్సిందే. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే పాజిటీవ్ పే సిస్టమ్ ఎలా పాటించాలో తెలుసుకోండి.
New Rules in August: నేటి నుంచి ఈ కొత్త రూల్స్... అన్నీ మీ డబ్బుకు సంబంధించినవే
Step 1- ముందుగా https://retail.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Personal Banking సెక్షన్‌లో లాగిన్ పైన క్లిక్ చేయాలి.
Step 3- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 4- కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 5- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత హోమ్ పేజీలో Request & Enquiries పైన క్లిక్ చేయాలి.
Step 7- ఆ తర్వాత Cheque Book Services పైన క్లిక్ చేయాలి.
Step 8- ఆ తర్వాత Positive Pay System పైన క్లిక్ చేయాలి.
Step 9- రిజిస్ట్రేషన్ ట్యాబ్ కింద అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
Step 10- ఆ తర్వాత స్క్రీన్ పైన వివరాలన్నీ కన్ఫామ్ చేయాలి.
Step 11- అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ పైన ఉన్న తేదీ, అమౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్, బెనిఫీషియరీ పేరు, ఎంఐసీఆర్ కోడ్ లాంటి వివరాలను సరిచూసుకొని కన్ఫామ్ చేయాలి.
Step 12- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి మళ్లీ Confirm పైన క్లిక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheque, Personal Finance, Sbi, State bank of india