Home /News /business /

SBI CHEQUE POSITIVE PAY SYSTEM KNOW HOW SBI CUSTOMERS CAN COMPLETE POSITIVE PAY SYSTEM PROCESS ON YONO SBI APP SS

SBI Alert: ఎస్‌బీఐ కొత్త రూల్... మొబైల్ యాప్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవండి

SBI Alert: ఎస్‌బీఐ కొత్త రూల్... మొబైల్ యాప్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ కొత్త రూల్... మొబైల్ యాప్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా బ్యాంకులన్నీ చెక్కుల క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ (Positive Pay System) పాటిస్తున్నాయి. రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయాలంటే పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాలి. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ పాటించకుండా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్స్ ఇస్తే బ్యాంకు వాటిని వెనక్కి పంపే అవకాశం ఉంది. కస్టమర్లు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలియజేయాలి. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా బ్యాంకుకు సమాచారం ఇవ్వొచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లో సులువుగా తాము ఇచ్చిన చెక్ వివరాలను బ్యాంకుకు వెల్లడించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రాసెస్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

IRCTC Shirdi Tour: రూ.4,000 లోపే హైదరాబాద్ నుంచి షిరిడీ టూర్... మూడు రోజుల ప్యాకేజీ వివరాలివే

యోనో ఎస్‌బీఐ యాప్‌లో చెక్ వివరాలు ఇలా సబ్మిట్ చేయండి


Step 1- ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 2- తమ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 3- ఆ తర్వాత యోనో ఎస్‌బీఐ యాప్‌లో లాగిన్ కావాలి.

Step 4- లెఫ్ట్ కార్నర్‌లో మెనూ ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 5- ఆ తర్వాత Service Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత Positive Pay System పైన క్లిక్ చేయాలి.

Step 7- ఆ తర్వాత Make a Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 8- View Request ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసిన చెక్ వివరాలు ఉంటాయి.

Step 9- చెక్ తేదీ, చెక్ అమౌంట్, బెనిఫీషియరీ పేరు లాంటి వివరాలన్నీ ఎంటర్ చేసి తర్వాతి స్టెప్‌లోకి వెళ్లాలి.

Step 10- నియమనిబంధనలన్నీ అంగీకరించిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 11- ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఎంటర్ చేసిన వివరాలు బ్యాంకుకు సబ్మిట్ అవుతాయి.

Aadhaar Mandatory: ఈ సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి... గుర్తుంచుకోండి

మీరు ఇచ్చిన వివరాలు, చెక్ పైన ఉన్న వివరాలను పోల్చి చూసి బ్యాంకు చెక్కును క్లియర్ చేస్తుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే చెక్కును బ్యాంకు ఎన్‌క్యాష్ చేయదు. యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఫాలో అయిన స్టెప్స్ యోనో లైట్ యాప్‌లో కూడా ఫాలో అవొచ్చు. రెండు యాప్స్‌లో ఈ స్టెప్స్ దాదాపు ఒకేలా ఉంటాయి.



నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పాజిటీవ్ పే సిస్టమ్‌ను రూపొందించింది. రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ రూల్ పాటించాల్సిందే.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Personal Finance, Sbi, Sbi yono, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు