గతంలో చెక్ బుక్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేస్తే తప్ప చెక్ బుక్ వచ్చేది కాదు. అది కూడా అప్లై చేసిన కొన్ని రోజుల తర్వాత చెక్ బుక్ చేతికి అందేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీని ఉపయోగించుకొని కస్టమర్లకు వేగంగా సేవలు అందిస్తున్నాయి బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా తమ కస్టమర్లు చెక్ బుక్ కోసం అప్లై చేసే పద్ధతిని చాలా సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే చెక్ బుక్ కోసం దరఖాస్తు చేయొచ్చు. సేవింగ్స్, కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ హోల్డర్లు ఆన్‌లైన్‌లో 25, 50 లేదా 100 చెక్స్ ఉన్న బుక్ కోసం అప్లై చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్‌లో చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత బ్యాంకుకు వెళ్లి చెక్ బుక్ తీసుకోవచ్చు. లేదా కొరియర్ ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు చెక్ బుక్ పోస్ట్ లేదా కొరియర్‌లో వస్తుంది. ప్రత్యామ్నాయంగా వేరే అడ్రస్ కూడా ఇవ్వొచ్చు. మీరు రిక్వెస్ట్ చేసిన మూడు వర్కింగ్ డేస్‌లో చెక్ బుక్ డిస్పాచ్ అవుతుంది. మరి ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్‌లో చెక్ బుక్ కోసం అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే
PM Kisan Scheme: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం
SBI Cheque Book: చెక్ బుక్ కోసం అప్లై చేయండి ఇలా
ముందుగా ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయాలి.
మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత Request & Enquiries ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Cheque book services ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Cheque Book Request పైన క్లిక్ చేయాలి.
మీరు ఏ అకౌంట్‌పైన చెక్ బుక్ కావాలో సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత మల్టీ సిటీ ఆప్షన్, ఎన్ని చెక్ బుక్స్, ఎన్ని చెక్స్ కావాలో వివరాలు ఎంటర్ చేయాలి.
సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి.
సబ్మిట్ చేసిన తర్వాత డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేయాలి.
రిజిస్టర్డ్ అడ్రస్, చివరిసారిగా డిస్పాచ్ చేసిన అడ్రస్, కొత్త అడ్రస్ అనే ఆప్షన్స్ ఉంటాయి.
వీటిలో ఏ అడ్రస్‌కు కావాలంటే ఆ అడ్రస్ సెలెక్ట్ చేయాలి.
చివరగా సబ్మిట్ చేయాలి.