Credit Card | దేశీ దిగ్గజ క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డు తన కస్టమర్లకు అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. పండుగ సీజన్‌లో పలు రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. వీటిల్లో ఈజీ ఈఎంఐ (EMI) బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈజీ ఈఎంఐ వల్ల కస్టమర్లు పలు రకాల ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. తక్కువ ఈఎంఐ, పలు రకాల టెన్యూర్లు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు పొందొచ్చు.
ఎస్‌బీఐ కస్టమర్లు వారి క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లను సలుభంగానే ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. కార్డు ద్వారా నిర్వహించిన కోనుగోళ్లను ఫ్లెక్సిపే ఈఎంఐలుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇలా ఈఎంఐలోకి మార్చుకుంటే వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. అదే క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించాల్సి వస్తే.. వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోవాలి.
కస్టమర్లకు బంపర్ బొనాంజా.. 3 బ్యాంకుల కీలక నిర్ణయం, ఇకపై..
అలాగే మీరు ఈఎంఐ టెన్యూర్‌ను మీకు నచ్చినట్లు ఎంచుకోవచ్చు. మీకు 3 నెలలు, ఆరు నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు, 36 నెలల టెన్యూర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంది. కేవలం 1 శాతం వడ్డీని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వసూలు చేస్తోంది. అందువల్ల మీరు ఈ పండుగ సీజన్‌లో ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.
జనవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు పనిచేయవంటే? లిస్ట్ ఇదే!
నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేయొచ్చు. దీన్ని ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. మీరు మూడు విధాలుగా మీ ట్రాన్సాక్షన్లను ఈఎంఐలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ కార్డు వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ ఫ్లెక్సిపే ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఎస్‌బీఐ కార్డు మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ పని చేయొచ్చు. యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత పే ఇన్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే వాట్సాప్ ద్వారా ఫ్లెక్సిపే అని మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. దీని కోసం మీరు 9004022022 అనే నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత ఈ నెంబర్‌కు ఫ్లెక్సిపే అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అప్పుడు మీరు సులభంగానే ఈజీ ఈఎంఐ సర్వీసులు పొందొచ్చు. పండుగ సీజన్‌లో షాపింగ్ చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. తక్కువ వడ్డీకే సులభంగానే షాపింగ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit card, EMI, Sbi, Sbi card, State bank of india