SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్

SBI Card | అమెజాన్‌లో షాపింగ్ చేద్దామనుకుంటున్నారా? ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో డిస్కౌంట్ పొందొచ్చు. ఆ ఆఫర్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: May 26, 2020, 10:55 AM IST
SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్
SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డు ఉందా? మీకు శుభవార్త. అమెజాన్‌లో కొనుగోళ్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ఎస్‌బీఐ. ఈ ఆఫర్ మే 26 నుంచి మే 31 వరకు కొనసాగుతుంది. అమెజాన్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో రూ.5000 కన్నా ఎక్కువ కొన్నవారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒక కార్డుపై గరిష్టంగా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైనా ఈ ఆఫర్ పొందొచ్చు.

ఈ ఆఫర్ ద్వారా డిస్కౌంట్ పొందాలనుకునే కస్టమర్లు అమెజాన్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో కనీసం రూ.5000 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ చేయాలి. పేమెంట్ సమయంలోనే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్, నోకాస్ట్ ఈఎంఐ పైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కార్పొరేట్ కార్డులు తప్ప మిగతా అన్ని క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై ఈ ఆఫర్ వర్తించదు. కేవలం క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించింది ఎస్‌బీఐ.

ఇవి కూడా చదవండి:

Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా

SBI Gold Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో గోల్డ్ లోన్

Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే
Published by: Santhosh Kumar S
First published: May 26, 2020, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading