Home /News /business /

SBI CARD LAUNCHES PULSE CREDIT CARD FOR FITNESS AND HEALTH ENTHUSIASTS OFFERS RS 4999 WORTH NOISE COLORFIT PULSE SMARTWATCH AS A WELCOME GIFT SS

SBI Card: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం

SBI Card: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం
(image: SBI Card)

SBI Card: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం (image: SBI Card)

SBI Pulse Card | ఫిట్‌నెస్ ప్రేమికులు, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారి కోసం ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును (Credit Card) లాంఛ్ చేసింది ఎస్‌బీఐ కార్డ్. ఎస్‌బీఐ పల్స్ క్రెడిట్ కార్డుతో ఎలాంటి లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

    మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ అయిన ఎస్‌బీఐ కార్డ్ సరికొత్త క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. ఫిట్‌నెస్, హెల్త్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్‌బీఐ కార్డ్ పల్స్ (SBI Card PULSE) పేరుతో ఈ కొత్త క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. ఈ క్రెడిట్ కార్డుతో ఫిట్‌నెస్, హెల్త్ సంబంధిత బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి యాన్యువల్ ఫీజు రూ.1,499 చెల్లించాలి. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. ఒక ఏడాదిలో రూ.2,00,000 కన్నా ఎక్కువ ఖర్చు చేసేవారికి రెన్యువల్ ఫీజు ఉండదు. రూ.4,00,000 ఖర్చు చేస్తే రూ.1500 విలువైన ఇ-వోచర్ లభిస్తుంది.

    ఉచితంగా స్మార్ట్‌వాచ్


    ఎస్‌బీఐ కార్డ్ పల్స్ క్రెడిట్ కార్డ్ తీసుకునేవారికి వెల్‌కమ్ గిఫ్ట్ కింద నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్ ఉచితంగా లభిస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌లో 1.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ (SPO2), స్లీప్ మానిటరింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌తో పాటు ఫిట్‌పాస్ ప్రో ఏడాది మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్ పల్స్ కస్టమర్లు దేశంలోని 4,000 పైగా జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లకు యాక్సెస్ లభిస్తుంది. వారానికి మూడు సెషన్ల చొప్పున నెలకు 12 సెషన్ల వరకు ఉచితంగా అటెండ్ కావొచ్చు.

    IRCTC Shirdi Tour: సాయిబాబా భక్తులకు శుభవార్త... షిరిడీ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

    జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లలో యాక్సెస్‌తో పాటు యోగా, డ్యాన్స్, కార్డియో లాంటి వ్యాయామాలు చేయాలనుకునేవారికి అన్‌లిమిటెడ్ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ సెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్సనలైజ్డ్ ఫిట్‌కోచ్, ఫిట్‌ఫీస్ట్ లాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. డైట్ కోసం ఎక్స్‌పర్ట్ న్యూట్రీషియనిస్ట్ సలహాలు కూడా తీసుకోవచ్చు.

    వీటితో పాటు నెట్‌మెడ్స్ ఫస్ట్ ఒక ఏడాది కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్ లభిస్తుంది. ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. యాన్యువల్ బేసిక్ హెల్త్ చెక్ అప్ చేయించుకోవచ్చు. నెట్‌మెడ్స్ నుంచి 2.5 శాతం ఎన్ఎంఎస్ క్యాష్ రూ.100 వరకు లభిస్తుంది. ప్యాథాలజీ ల్యాబ్ టెస్టులపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. మెడిసిన్ కొనేవారికి అన్‌లిమిటెడ్ డెలివరీ ఉచితం.

    PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? మీ ఆధార్ నెంబర్‌తో సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా

    ఎస్‌బీఐ పల్స్ క్రెడిట్ కార్డుతో మెడికల్ షాప్స్, డైనింగ్, మూవీస్ కోసం ఖర్చు చేస్తే ప్రతీ రూ.100 కు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇతర లావాదేవీలకు ప్రతీ రూ.100 ట్రాన్సాక్షన్‌పై 2 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఈ కార్డుపై ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫ్రాడ్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్ కవర్ రూ.1,00,000 వరకు, ఎయిర్ యాక్సిడెంట్ కవర్ రూ.50,00,000వరకు లభిస్తుంది. ఏడా 8 సార్లు డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ కాంప్లిమెంటరీగా లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Credit cards, Personal Finance, Sbi card

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు