ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) ఉన్నవారికి అలర్ట్. ఎస్‌బీఐ కార్డ్స్ కొత్త రూల్స్ ప్రకటించింది. రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకునేవారికి జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్ (SimplyCLICK Credit Card) వాడుతున్నవారికి కొత్త రూల్స్ వర్తిస్తాయి. వోచర్లు, రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకునే విషయంలో రెండు మార్పులు రానున్నాయి. ఆన్‌లైన్ స్పెండింగ్ మైల్‌స్టోన్స్ దాటినవారికి ఇచ్చే క్లియర్‌ట్రిప్ ఓచర్లను ఒకే ట్రాన్సాక్షన్‌లో రీడీమ్ చేయాలని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. ఒక వోచర్ లేదా ఆఫర్‌ను మరో వోచర్, ఆఫర్‌తో కలిపే అవకాశం ఉండదు. ఈ రూల్ జనవరి 6 నుంచి అమలులోకి రానుంది. కస్టమర్లకు ఈ వోచర్ లేదా కూపన్ కోడ్ ద్వారా గరిష్టంగా రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక అమెజాన్‌లో సింప్లీ క్లిక్ లేదా సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డుతో లావాదేవీలు చేస్తే 10 రెట్లు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్‌ని 5 రెట్లకు తగ్గించింది ఎస్‌బీఐ కార్డ్ . 2023 జనవరి 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. అయితే క్లియర్‌ట్రిప్, ఈజీడైనర్, అపోలో 24X7, బుక్ మై షో, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్ లావాదేవీలపై 10 రెట్లు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
Araku One Day Tour: ఒక్క రోజులో అరకు చుట్టేసి వచ్చేయండి... ప్యాకేజీ వివరాలివే
వోచర్ లేదా కూపన్ కోడ్ పోయినా, దొంగిలించబడినా లేదా దుర్వినియోగమైనా క్లియర్‌ట్రిప్, ఎస్‌బీఐ బాధ్యత వహించవు.
వోచర్ లేదా కూపన్ కోడ్ www.cleartrip.com లో లేదా దేశీయ లేదా అంతర్జాతీయ విమానాల కోసం క్లియర్‌ట్రిప్ మొబైల్ యాప్‌లో చేసిన ఆన్‌లైన్ బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
రెండేళ్లలోపు పిల్లల టిక్కెట్ బుకింగ్‌లపై వోచర్ లేదా కూపన్ కోడ్ వర్తించదు. అదనంగా, పిల్లల కోసం బుక్ చేసుకునే సందర్భంలో పెద్దలు పిల్లలతో పాటు ఉండాలి.
కూపన్ లేదా వోచర్ కోడ్ అందిన తేదీ నుంచి నాలుగు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
కస్టమర్ ఆఫర్‌ను దుర్వినియోగం చేస్తే ఆఫర్‌ను తిరస్కరించే లేదా బుకింగ్‌ను రద్దు చేసే హక్కు క్లియర్‌ట్రిప్‌కు ఉంది.
వోచర్ లేదా కూపన్ కోడ్‌ని రీఫండ్ చేయడం, రీప్లేస్ చేయడం, రీవాల్యుడేట్ చేయడం లేదా నగదు కోసం మార్పిడి చేయడం సాధ్యం కాదు.
ఈ నియమనిబంధనలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎస్‌బీఐ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.sbicard.com/ లో తెలుసుకోవచ్చు.
New Rules: జనవరి 1 నుంచి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కొత్త రూల్స్
ఇక, నవంబర్ 15న కొత్త ప్రాసెసింగ్ ఫీజు అమలులోకి వచ్చింది. అన్ని మర్చెంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజును రూ.199 చేసింది. గతంలో ఇది రూ.99 ఉండేది. అలాగే, అన్ని అద్దె చెల్లింపు లావాదేవీలపై ఇప్పుడు రూ.99 ప్రాసెసింగ్ ఫీజ్ విధించబడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance, Sbi card