SBI CARD ELITE TO AXIS BANK ACE CREDIT CARD KNOW ABOUT BEST 5 ALL ROUNDER CREDIT CARDS SS
Credit Cards: ఎక్కువ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ ఇచ్చే 5 ఆల్-రౌండర్ క్రెడిట్ కార్డ్స్ ఇవే
Credit Cards: ఎక్కువ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ ఇచ్చే 5 ఆల్-రౌండర్ క్రెడిట్ కార్డ్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Credit Cards | బ్యాంకులు వేర్వేరు అవసరాలకు వేర్వేరు రకాల క్రెడిట్ కార్డుల్ని (Credit Cards) అందిస్తుంటాయి. వీటిలో ఎక్కువగా రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డులు కొన్నే ఉంటాయి. ఆ కార్డుల గురించి తెలుసుకోండి.
మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్ (Credit Card) తీసుకునే ముందు ఆ కార్డుపై వచ్చే ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి. మీ అవసరాలకు తగ్గట్టుగానే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు మీరు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తున్నారనుకుందాం. ఐఆర్సీటీసీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (IRCTC SBI Credit Card), ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ (IRCTC BoB Credit Card) బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా షాపింగ్ చేసేవారైతే లైఫ్‌స్టైల్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఫిట్నెస్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటే ఎస్బీఐ కార్డ్ పల్స్ (SBI Card PULSE) క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇలా వేర్వేరు అవసరాలకు వేర్వేరు క్రెడిట్ కార్డుల్ని ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు. అయితే కొన్ని క్రెడిట్ కార్డులపై రివార్డ్స్, క్యాష్‌బ్యాక్స్ ఎక్కువగా వస్తాయి. అలాంటి 5 బెస్ట్ క్రెడిట్ కార్డుల వివరాలు తెలుసుకోండి.
Axis Bank Ace Credit Card: యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారు గూగుల్ పే ద్వారా యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. జొమాటో, ఓలా, స్విగ్గీ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రాన్సాక్షన్స్ చేస్తే 4 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర చెల్లింపులపై 2 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌తో పాటు కార్డ్ హోల్డర్లకు 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, 400 పైగా రెస్టారెంట్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ కార్డు యాన్యువల్ ఫీజు రూ.499.
Standard Chartered DigiSmart Credit Card: స్టాండర్డ్ ఛార్టర్డ్ డిజీస్మార్ట్ క్రెడిట్ కార్డుతో గ్రోఫర్స్, జొమాటోలో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రతీ నెలా ఐదు లావాదేవీలపై ఈ డిస్కౌంట్ పొందచ్చు. మింత్రాలో 20 శాతం తగ్గింపు, యాత్రలో మూడు నెలలకోసారి డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్‌పై 20 శాతం తగ్గింపు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్‌పై 10 శాతం, డొమెస్టిక్ హోటల్ బుకింగ్‌పై 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ కార్డు యాన్యువల్ ఫీజు రూ.588.
HDFC Regalia Credit Card: హెచ్డీఎఫ్సీ రెగాలియా క్రెడిట్ కార్డుతో జరిపే ప్రతీ రూ.150 ట్రాన్సాక్షన్‌కు 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇన్స్యూరెన్స్, ఎడ్యుకేషన్, యుటిలిటీస్ చెల్లింపులు మాత్రమే కాదు... ఇంటి అద్దె చెల్లించినా రివార్డ్స్ పొందొచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్‌ని హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్, గిఫ్ట్స్, వోచర్స్, ఇతర ఉత్పత్తులకు రీడీమ్ చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ రెగాలియా క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.2,500.
HDFC Diners Club Privilege Credit Card: హెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డు తీసుకున్నవారికి అమెజాన్ ప్రైమ్, టైమ్స్ ప్రైమ్, బిగ్ బాస్కెట్, జొమాటో ప్రో ఇయర్లీ మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. ప్రముఖ స్పాస్, సెలన్స్, జిమ్స్, వెల్నెస్ సెంటర్లలో ఎక్స్‌క్లూజీవ్ డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.2,500.
SBI Card Elite: ఎస్బీఐ కార్డ్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బాటా, ప్యాంటలూన్స్, యాత్ర, షాపర్స్ స్టాప్ లాంటి బ్రాండ్స్ నుంచి రూ.5,000 విలువైన వోచర్స్ లభిస్తాయి. ట్రైడెంట్ ప్రివిలేజ్, క్లబ్ విస్తారా మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. ఎస్బీఐ కార్డ్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.5,000.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.