హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI News: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. 3 కొత్త క్రెడిట్ కార్డులు, రూ.499 చెల్లిస్తే చాలు అదిరే బెనిఫిట్స్!

SBI News: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. 3 కొత్త క్రెడిట్ కార్డులు, రూ.499 చెల్లిస్తే చాలు అదిరే బెనిఫిట్స్!

SBI News: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. 3 కొత్త క్రెడిట్ కార్డులు, రూ.499 చెల్లిస్తే చాలు అదిరే బెనిఫిట్స్!

SBI News: ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. 3 కొత్త క్రెడిట్ కార్డులు, రూ.499 చెల్లిస్తే చాలు అదిరే బెనిఫిట్స్!

Credit Card News | ఎస్‌బీఐ కార్డు తీపికబురు అందించింది. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. పంబాజ్ అండ్ సింద్ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ కార్డులను లాంచ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

SBI Credit Card | దేశీ దిగ్గజ క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ కార్డు (SBI) కస్టమర్ల కోసం కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను (Credit Card) తీసుకువచ్చింది. భాగస్వామ్యంలో భాగంగా ఎస్‌బీఐ కార్డు ఇప్పుడు మూడు కొత్త క్రెడిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.

పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్, పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డు అనేవి ఇవి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎస్‌బీఐ కార్డు ఈ కొత్త క్రెడిట్ కార్డులను తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ అనే కార్డులను ప్రధానంగా ప్రీమియం కస్టమర్లు లక్ష్యంగా తీసుకువచ్చింది. అలాగే పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డు ద్వారా అధిక రివార్డులు పొందొచ్చు. అధిక విలువ పొందొచ్చు.

కస్టమర్లకు బంపర్ బొనాంజా.. కొత్త సంవత్సరం ఆరంభంలోనే 2 శుభవార్తలు అందించిన బ్యాంక్!

తమ కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లు అందించడానికి, వారికి మెరుగైన అనుభూతిని కలిగించడానికి ఎస్‌బీఐ కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పంజాబ్ అంద్ సింద్ బ్యాంక్ ఎండీ, సీఈవో స్వరూప్ కుమార్ సాహా తెలిపారు. అలాగే కొత్త కస్టమర్లను పొందటానికి కూడా ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో రామ మోహన్ రావు అమర మాట్లాడుతూ.. బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు విభాగం విస్తరణకు ఈ భాగస్వామ్యం ఎంత గానో ఉపయోగపడుతుందని తెలిపారు.

బంగారం, వెండి కొనే వారికి కొత్త ఏడాది భారీ షాక్!

పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ఎలైట్ జాయినింగ్ ఫీజు రూ. 4,999గా ఉంది. అలాగే పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ జాయినింగ్ ఫీజు రూ. 2,999గా ఉంది. ఇక పీఎస్‌బీ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డు ఫీజు రూ. 499. వీటికి ట్యాక్స్‌లు అదనం అని గుర్తించుకోవాలి. సింప్లీ సేవ్ కార్డు రూపే ప్లాట్‌ఫామ్‌పై లభిస్తుంది. ఇక మిగిలిన రెండు కార్డులు వీసా ప్లాట్‌ఫామ్‌పై లభిస్తున్నాయి. సింప్లీ సేవ్ కార్డు విషయానికి వస్తే.. కార్డు పొందిన 60 రోజుల్లో రూ.2 వేలు ఖర్చు చేస్తే 2 వేల రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఇంకా ఏడాదిలో రూ.లక్ష లేదా ఆపైన ఖర్చు చేస్తే.. ఫీజు మాఫీ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇకపోతే ఎస్‌బీఐ కార్డ్ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది కస్టమర్లకు వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది. అలాగే పంజాబ్ అంద్ సింద్ బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంక్. ఇది 1908లో ఏర్పాటైంది. ఇందులో ప్రభుత్వానికి 98.25 శాతం వాటా ఉంది. ఎస్‌బీఐ కార్డు షేరు ధర దాదాపు రూ. 800 సమీపంలో ఉంది. అలాగే పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ షేరు ధర రూ. 33 వద్ద కొనసాగుతోంది.

First published:

Tags: Banks, Credit cards, Sbi, Sbi card, State bank of india

ఉత్తమ కథలు