హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Offers: ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు అదరహో.. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు!

SBI Offers: ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు అదరహో.. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు!

 ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు అదుర్స్.. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు!

ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు అదుర్స్.. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు!

Credit Card | ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లు పండుగ సీజన్‌లో ఆకర్షణీయ డీల్స్ పొందొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  SBI Card Offers | ఫెస్టివ్ సీజన్ ప్రారంభం అయ్యింది. మీరు షాపింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? ఎస్‌బీఐ కార్డు అదిరిపోయే డిస్కౌంట్లు తీసుకువచ్చింది. పలు రకాల బ్రాండ్లపై ఆకర్షణీయ డీల్స్ అందిస్తోంది. ఎస్‌బీఐ (SBI) కార్డ్ కస్టమర్లు దసరా సీజన్‌లో మంచి ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఎస్‌బీఐ కార్డు దాదాపు 1600కు పైగా ఆఫర్లు (Offers) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చంట్ల వద్ద ఈ ఆఫర్లు పొందొచ్చు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఈ డీల్స్ లభిస్తాయి.

  ఎస్‌బీఐ కార్డు తాజాగా ఈ విషయాలను వెల్లడించింది. దాదాపు 70 నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే 1550 రీజినల్, హైపర్ లోకల్ ఆఫర్లు తెచ్చింది. దేశవ్యాప్తంగా 2600 పట్టణాల్లో ఎస్‌బీఐ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు 22.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. వివిధ బ్రాండ్లపై ఈ ఆఫర్లు ఉంటాయి.

  దసరా ఆఫర్.. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్!

  ఎస్‌బీఐ కార్డు ఇప్పటికే ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు పొందొచ్చు. 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే ఎస్‌బీఐ కార్డు.. ఫ్లిప్‌కార్ట్ , శాంసంగ్ మొబైల్ , రిలయన్స్ ట్రెండ్స్, పాంటలూన్స్, రేమాండ్స్, ఎల్‌జీ, శాంసంగ్, సోనీ, హెచ్‌పీ, మేక్ మై ట్రిప్ వంటి పలు రకాల బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  బంగారం లాంటి ఛాన్స్.. డిస్కౌంట్‌లో గోల్డ్! నేటి రేట్లు ఇవే

  అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. 1.6 లక్షల మర్చంట్లు, 2.25 లక్షల స్టోర్లలో కస్టమర్లు ఈ సదుపాయం పొందొచ్చు. 25 ఎలక్ట్రానిక్స్, మొబైల్ బ్రాండ్ల నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన రీజినల్ మర్చంట్ల వద్ద ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎస్‌బీఐ కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రామ మోహన్ రావు అమర మాట్లాడుతూ.. ఈ పండుగ ఆఫర్ల ద్వారా కస్టమర్లు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఆఫర్లతో పండుగ సంతోషం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.  కాగా కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాకుండా ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా ఫెస్టివ్ ఆఫర్లను తీసుకువచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఈ పండుగ సీజన్‌లో పలు రకాల డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను సొంతం చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Credit card, Offers, Sbi, Sbi card

  ఉత్తమ కథలు