హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Car Loan Offer: కొత్త కార్ కొంటే 100 శాతం ఫైనాన్స్... ఆ మోడల్‌పై ఎస్‌బీఐ ఆఫర్

SBI Car Loan Offer: కొత్త కార్ కొంటే 100 శాతం ఫైనాన్స్... ఆ మోడల్‌పై ఎస్‌బీఐ ఆఫర్

SBI Car Loan Offer: కొత్త కార్ కొంటే 100 శాతం ఫైనాన్స్... ఆ మోడల్‌పై ఎస్‌బీఐ ఆఫర్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Car Loan Offer: కొత్త కార్ కొంటే 100 శాతం ఫైనాన్స్... ఆ మోడల్‌పై ఎస్‌బీఐ ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Car Loan Offer | యోనో ఎస్‌బీఐ ద్వారా కారు కొనేవారికి 100 శాతం ఫైనాన్సింగ్ ఆప్షన్ అందిస్తోంది ఎస్‌బీఐ. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) కారు కొనేవారు ఈ ఆఫర్ పొందొచ్చు. యాప్ ద్వారా కార్ ఆర్డర్ చేయొచ్చు.

కొత్త కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అద్భుతమైన కార్ లోన్ (Car Loan) ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా లోన్ ద్వారా వాహనం తీసుకోవాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ డౌన్ పేమెంట్ బ్యాంకుల్ని, ఫైనాన్సింగ్ సంస్థల్ని బట్టి ఉంటుంది. 70 శాతం, 80 శాతం, 90 శాతం ఫైనాన్సింగ్ సదుపాయాన్ని మాత్రమే ఇస్తుంటాయి బ్యాంకులు. అయితే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బ్యాంకులు 100 శాతం ఫైనాన్సింగ్ ఇస్తుంటాయి. అంటే కారు ధర ఎంత ఉంటే అంత ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. సరికొత్త టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) కార్ బుక్ చేసేవారికి 100 శాతం ఫైనాన్స్ ఇస్తోంది.

ఎస్‌బీఐ టాటా ఆల్ట్రోజ్ కారుపై ఇస్తున్న ఆఫర్ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కస్టమర్లు యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేయాల్సి ఉంటుంది. యోనో ఎస్‌బీఐ ద్వారా బుక్ చేస్తే 100 శాతం ఫైనాన్సింగ్‌తో పాటు రూ.3,000 విలువైన ఎక్స్‌ట్రా క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కార్ లోన్ వడ్డీ రేటు 7.35 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. మంచి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే కార్ లోన్ లభిస్తుంది. కార్ లోన్ అప్రూవల్ కూడా ఇన్‌స్టంట్‌గా లభిస్తుంది. మరి యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో కార్ లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

Post Office Scheme: ఇలా పొదుపు చేస్తే రూ.16 లక్షలు మీవే... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి

Step 1- ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 3- ముందే రిజిస్ట్రేషన్ చేసినవారు తమ వివరాలతో లాగిన్ కావాలి.

Step 4- ఆ తర్వాత Shop & Order పైన క్లిక్ చేయాలి.

Step 5- ఆ తర్వాత Automobiles సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 6- తర్వాత Tata Altroz కార్ సెలెక్ట్ చేయాలి.

Step 7- కార్ ఆర్డర్ చేసి లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 8- ఆ తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి.

Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 10- చివరగా సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రాసెసర్ పూర్తి చేయాలి.

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారు నగలు కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

యోనో ఎస్‌బీఐ ద్వారా కార్ లోన్‌కు అప్లై చేస్తే అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్‌ప్రిన్సిపల్ వెంటనే అప్రూవ్ అవుతుంది. 24 గంటలపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 7 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. ఆన్ రోడ్ ధరపైన ఫైనాన్సింగ్ పొందొచ్చు. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు కార్ లోన్‌కు అప్లై చేయొచ్చు.

ఎస్‌బీఐ వేర్వేరు రకాల కార్ లోన్స్ ఇస్తోంది. ఎస్‌బీఐ న్యూ కార్ లోన్ స్కీమ్, లాయల్టీ కార్ లోన్ స్కీమ్, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్, ఎస్‌బీఐ అష్యూర్డ్ కార్ లోన్ స్కీమ్, ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ పేరుతో పలు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కార్ లోన్ టైప్, కస్టమర్ల క్రెడిట్ ప్రొఫైల్‌ని బట్టి వడ్డీ మారుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Car loans, Cheapest Car Loan, Sbi, State bank of india

ఉత్తమ కథలు