Home /News /business /

SBI CAR LOAN OFFER STATE BANK OF INDIA ANNOUNCED ZERO PROCESSING FEES AND ZERO PREPAYMENT PENALTY ON CAR LOANS SS

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Car Loan | కార్ లోన్ కొనాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్ లోన్‌కు అప్లై చేసి ఆఫర్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? సెకండ్ హ్యాండ్ కార్ కొనే ఆలోచనలో ఉన్నారా? లేదా ఎలక్ట్రిక్ కార్ కొంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కార్ లోన్ (Car Loan) తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు తొలగించింది. కార్ లోన్ ప్రాసెసింగ్ కోసం ఎలాంటి ఛార్జీలు తీసుకోవట్లేదు. కార్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినా ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు ఉండవు. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేసేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. ఫోర్ వీలర్ కొనాలనుకునేవారికి ఎస్‌బీఐ వేర్వేరు లోన్ ఆఫర్స్ అందిస్తోంది. ఎస్‌బీఐలో కార్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎస్‌బీఐ యోనో యాప్‌లో కార్ లోన్‌కు ఎలా అప్లై చేయాలి? తెలుసుకోండి.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్‌బీఐ న్యూ కార్ లోన్ స్కీమ్, లాయల్టీ కార్ లోన్ స్కీమ్, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్, ఎస్‌బీఐ అష్యూర్డ్ కార్ లోన్ స్కీమ్, ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ పేరుతో పలు రకాల లోన్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వడ్డీ రేట్లు చూస్తే ఎస్‌బీఐ కార్ లోన్, ఎన్ఆర్ఐ కార్ లోన్, అష్యూర్డ్ కార్ లోన్ స్కీమ్ ద్వారా ఫోన్ వీలర్ లోన్ తీసుకుంటే 7.25 శాతం నుంచి 7.95 శాతం వడ్డీ, లాయల్టీ కార్ లోన్ స్కీమ్‌కు 7.20 శాతం నుంచి 7.90 శాతం వడ్డీ, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్ తీసుకుంటే 8.75 శాతం వడ్డీ, ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ తీసుకుంటే 7.05 శాతం, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్ తీసుకుంటే 9.25 శాతం నుంచి 12.75 శాతం వడ్డీ చెల్లించాలి.

    CNG Cars: సీఎన్‌జీ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే


    ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ అకౌంట్‌లో లాగిన్ కావాలి.
    హోమ్ పేజీలో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.
    లోన్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
    ఆ తర్వాత కార్ లోన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి.
    కొనాలనుకుంటున్న వాహనం, తీసుకోవాలనుకుంటున్న లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
    వెహికిల్ ఎస్టిమేషన్ వివరాలు, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    చివరగా సబ్మిట్ చేస్తే లోన్ నేరుగా డీలర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

    Tata Car: ఈ కారు ధర పెంచేసిన టాటా మోటార్స్... ఎంతంటే

    ఎస్‌బీఐ కస్టమర్లు తక్కువ వడ్డీకే కార్ లోన్ తీసుకోవచ్చు. కనీసం రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొన్ని వాహనాలకు ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు కార్ లోన్ లభిస్తుంది. ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీలు, ఎంయూవీలు తీసుకోవడానికి రుణాలకు అప్లై చేయొచ్చు. ఏడేళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. కస్టమర్లకు ఆప్షనల్‌గా ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loan, Car loans

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు