SBI Car Loan | కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు కొనుగోలుదారులకు తీపికబురు అంచింది. అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో లోన్ (Loan) తీసుకొని కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది.
కారు కొనేందుకు ఎస్బీఐ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన లోన్ వడ్డీ రేటు మారొచ్చు. అంతేకాకుండా ఈ లోన్ పొదడం వల్ల ఏడు ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీని వల్ల నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగే కారు ధరలో 90 శాతం మొత్తాన్ని ఫైనాన్స్ రూపంలో పొందొచ్చు.
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. డిసెంబర్ 12లోపు ఇలా చేయండి, లేదంటే అకౌంట్ పని చేయదు!
అంతేకాకుండా ఎస్బీఐ కారు లోన్‌పై జీరో ప్రిపేమెంట్ పెనాల్టీ బెనిఫిట్ ఉంది. ఇంకా ఫోర్ క్లోజర్ చార్జిలు కూడా ఉండవు. ఏడాది తర్వాతనే ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం లభిస్తోంది. అంటే మూడు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ కోసం అప్లై చేసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ 2 స్కీమ్స్‌తో నెల నెలా చేతికి డబ్బులు.. ప్రతి నెలా రూ.9 వేలకు పైగా పొందొచ్చు!
Explore beautiful destinations in your dream car with SBI Car Loans. Get exciting offers like zero processing fee, nil prepayment penalty and many more. Apply now on Yono app or Know more: https://t.co/cXl062fVtz#SBI #CarLoan #YONO #AmritMahotsav pic.twitter.com/inKHk1crJv
— State Bank of India (@TheOfficialSBI) November 25, 2022
అంతేకాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి నవంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏకంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారు, మోడల్, డీలర్ షిప్ ప్రాతిపదికన కారు ఆఫర్లో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కారు కొనే వారు ఈ ప్రయోజనం కూడా సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Car loans, Sbi, State bank of india