Car Loan | కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏంటని అనుకుంటున్నారా? జీరో డౌన్ పేమెంట్‌తో మీరు కారు (Car) ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ SBI) తన కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీంతో కొత్త కారు కొనాలని చూసే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.
ఎస్‌బీఐ యోనో ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. అందువల్ల కొత్త మీరు ఈ ఆఫర్ సొంతం చేసుకోవాలని భావిస్తే.. ముందుగా యోనో యాప్ ఉపయోగిస్తూ ఉండాలి. లేదంటే ఈ డీల్ సొంతం చేసుకోలేరు. ఇప్పటికే యోనో యాప్ వాడుతూ ఉంటే.. ఇబ్బంది లేదు. ఆఫర్ పొందొచ్చు. ఒక వేళ యోనో యాప్ మీ ఫోన్‌లో లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కచ్చితంగా ఫోన్‌లో ఉండాలి. అప్పుడు ఈ యోనో యాప్‌ను ఉపయోగించగలరు.
నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారా? 10 నిమిషాల్లో రూ.4 లక్షల లోన్ పొందండిలా!
ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు యాప్ రిజిస్టర్ పూర్తి చేసుకోవచ్చు. తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఎడమ వైపున పైభాగంలో మూడు గీతలు కనిపిస్తాయి. దీనిపై క్లిక చేయాలి. ఇప్పుడు చాలా ఆప్షన్లు ఉంయి. వీటిల్లో ఆన్‌లైన్ షాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే షాప్ అండ్ ఆర్డర్ ఉంటుంది. దీన్ని ఎంచుకోవాలి.
రైతులకు శుభవార్త.. ఈరోజే అకౌంట్లలోకి డబ్బులు, వచ్చాయో లేదో చెక్ చేసుకోండిలా!
ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆటోమాల్ ఎస్‌బీఐ యోనో అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత వెల్‌కమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు కారు ఆఫర్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆఫర్ ఎంచుకోవచ్చు. కియా కారుపై జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంక్ 100 శాతం ఫండింగ్ అందిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. మీకు కారు ఆఫర్లు కనిపిస్తాయి. కియా సొనెట్, కియా సెల్టోస్, కియా కరెన్స్ కియా కార్నివల్ వంటి మోడళ్లకు జీరో డౌన్ పేమెంట్ వర్తిస్తుంది. మీకు నచ్చిన మోడల్ ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత మీకు బుక్ ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉంటుంది. కారును బుక్ చేసుకోవచ్చు. ఇలా మీరు జీరో డౌన్ పేమెంట్‌తో కారు కొనొచ్చు. ఎస్‌బీఐ కార్ లోన్ అందిస్తుంది. నెలవారీ ఈఎంఐ చెల్లించుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Car loans, Kia cars, KIA Motors, Sbi, State bank of india