ఈ రోజు దేశంలో కాలుష్యం సవాలుగా మారింది. ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ సమస్య గురించి ఆందోళన చెందుతూ, ఎలక్ట్రిక్ కారు కొనడం గురించి ఆలోచిస్తుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో మీకు సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఎస్బిఐ గ్రీన్ కార్ లోన్ ఇస్తోంది. ఈ రుణం చాలా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందకు వచ్చింది. 21 మరియు 67 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే గ్రీన్ కార్ లోన్ పొందవచ్చు. ఈ రుణం తిరిగి చెల్లించడానికి మూడు నుండి 8 సంవత్సరాలు కాలవ్యవధి నిర్ణయించనున్నారు. వాహనం ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు మీరు రుణం పొందవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ కార్ లోన్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై, సాధారణ కారు రుణం కంటే 20 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేటు వద్ద రుణం దక్కనుంది. దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రిక్ కారును కొనడానికి ఈ రాయితీ ఇస్తున్నారు.
ముఖ్యంగా సాలరీడ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యం, పారా మిలిటరీ ఫోర్స్ సిబ్బంది, రక్షణ సంస్థ ఉద్యోగులు సంవత్సరానికి 3 లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంటే ఈ రుణం పొందవచ్చు. మీరు ఈ రుణాన్ని నెలవారీ జీతం కంటే 48 రెట్లు పొందవచ్చు.
ఇక నాన్ సాలరీడ్ విభాగంలో వృత్తి నిపుణులు, సెల్ప్ ఫైనాన్స్, వ్యాపారవేత్తలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో 4 రెట్లు వరకు రుణాలు పొందవచ్చు. ఏటా కనీసం 3 లక్షల ఆదాయం పొందడం అవసరం. వ్యవసాయ పనులలో నిమగ్నమైన వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి వారి వార్షిక ఆదాయానికి మూడు రెట్లు రుణం పొందవచ్చు. ఇందుకోసం 4 లక్షలకు పైగా ఆదాయం ఉండాలన్న షరతు విధించారు. పూర్తి వివరాల కోసం Green Car Loan: For Electric Cars ఇక్కడ క్లిక్ చేయండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Business, Cars