
SBI Car Loan: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేస్తే ఎస్బీఐ నుంచి అద్భుతమైన ఆఫర్స్
SBI Car Loan | కొత్త కార్ కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా Tata Nexon EV బుక్ చేస్తే ఇంటి దగ్గరే ఉచితంగా హోమ్ ఛార్జ్ ఇన్స్టాలేషన్ ఏర్పాటు చేయనుంది కంపెనీ. ఇంటి దగ్గరే హోమ్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ ఎస్బీఐ యోనో యాప్‌లో Tata Nexon EV బుక్ చేసి ఇంటి దగ్గర ఉచితంగా హోమ్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని వల్ల వాహనాన్ని ఛార్జింగ్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అప్లై చేస్తే 7.50 శాతం వడ్డీ రేటుకే కార్ లోన్ పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు 0 శాతం. ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ అయిన తర్వాత Shop & Order ఓపెన్ చేసి అందులో ఆటోమొబైల్స్ సెక్షన్లో టాటా మోటార్స్ సెలెక్ట్ చేయాలి. టాటా నెక్సాన్ ఈవీ సెలెక్ట్ చేసి బుక్ చేస్తే పైన చెప్పిన ఆఫర్స్ అన్నీ పొందొచ్చు.
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కార్ లోన్స్‌పై చాలా ఆఫర్స్ ఉన్నాయి. వాటిలో టాటా నెక్సాన్ ఈవీ ఆఫర్ ఒకటి. ఇతర బ్రాండ్లకు చెందిన వాహనాలపైనా ఆఫర్స్ పొందొచ్చు. కార్ లోన్ ఇన్‌ప్రిన్సిపల్ అఫ్రూవల్ కూడా వెంటనే జరుగుతుంది. అయితే మీరు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా బుక్ చేసినంత మాత్రాన ఆ వాహనానికి సంబంధించిన క్వాలిటీ, ఫీచర్స్, సర్వీస్ లాంటివాటికి ఎస్బీఐ బాధ్యత వహించదు. ఏ సమస్య ఉన్నా కంపెనీనే ఆశ్రయించాలి. ఎస్బీఐ యోనో యాప్‌లో బుక్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్స్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:September 02, 2020, 12:17 IST