Savings Account | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ (Bank Account) సర్వీసులు కూడా ఉన్నాయి. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా తెరవాలని భావించే వారు కచ్చితంగా కేవైసీ డాక్యుమెంట్లు వెంట తీసుకువెళ్లాలి. సాధారణంగా అయితే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అనేవి పేదల కోసం తీసుకువచ్చారు. చార్జీలు, ఫీజులు వంటి భారం లేకుండా పేదలు డబ్బు పొదుపు చేయడాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చారు.
గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర, ఈరోజు ఎంత తగ్గిందంటే?
ఎస్బీఐ ప్రతి బ్రాంచ్‌లోనూ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే చెక్ బుక్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. మీరు బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. చెక్ బుక్ ఉండదు.
ఎస్బీఐ టాప్ 5 స్కీమ్స్.. రూ.లక్షకు రూ.10 లక్షల లాభం!
ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగిన వారికి నెలలో నాలుగు సార్లు ఏటీఎం నుంచి ఉచితంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. కస్టమర్లకు బేసిక్ రూపే డెబిట్ కార్డు అందిస్తారు. దీనికి ఎలాంటి వార్షిక చార్జీలు ఉండవు. ఉచితంగానే కార్డు పొందొచ్చు. మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. అకౌంట్లోని డబ్బులపై 2.7 శాతం వడ్డీ వస్తుంది.
ఇంకా నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మనీ ట్రాన్స్ఫర్ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే బ్యాంక్ అకౌంట్ క్లోజర్ చార్జీలు కూడా ఉండవు. రెండేళ్ల పాటు అకౌంట్‌ను ఉపయోగించకపోతే అప్పుడు అది ఇన్‌యాక్టివ్ అకౌంట్‌గా మారిపోతుంది. అందువల్ల మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి అకౌంట్‌ను యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవాలని భావించే వారు ఇతర బ్యాంకుల్లో అకౌంట్ కలిగి ఉండకూడదు. బ్యాంక్ ఖాతా లేని వారికి మాత్రమే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banks, Sbi, State bank of india