• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SBI BANK REDUCES HOME LOAN INTEREST RATES FULL DETAILS HERE GH SA

SBI home loan rates: గుడ్ న్యూస్.. హోమ్‌ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ!

State Bank of India SBI warns customers about fake loan offers and fake companies

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించింది. కొత్త

  • Share this:
గత ఏడాది లాక్‌డౌన్‌ తరువాత చాలామంది ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఆ తరువాత కూడా కరోనా ప్రభావం కొనసాగడంతో ఉద్యోగులు సొంత ఇంటి కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు అతి తక్కువ వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు మే1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా సవరణల తరువాత.. రూ.30 లక్షల వరకు ఉండే హోమ్ లోన్లపై కస్టమర్లు చెల్లించాల్సిన వడ్డీ సంవత్సరానికి 6.7 శాతానికి పరిమితమైంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఉండే లోన్లపై వడ్డీ రేటు 6.95గా ఉంది. రూ.75 లక్షలకు పైగా ఉండే గృహ రుణాలపై 7.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.

హోమ్ లోన్ తీసుకునే మహిళా కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. వీరికి వడ్డీ రేట్లపై 5 bps వరకు తగ్గింపులు ఉంటాయని తెలిపింది. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు కూడా 5 bps వరకు అదనపు వడ్డీ రాయితీని పొందవచ్చని బ్యాంక్ పేర్కొంది. గృహ రుణాల విభాగంలో కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది.

హోమ్ ఫైనాన్స్‌ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లీడర్‌గా ఉందని సంస్థ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ విభాగంలో కస్టమర్ల పరిధిని పెంచేందుకు వడ్డీ రేట్లపై తగ్గింపులను ప్రకటించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. గత నెలలో 6.95 శాతం నుంచి ప్రారంభమైన గృహ రుణాల వడ్డీ రేట్లను బ్యాంకు సవరించింది.హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో స్టేట్ బ్యాంక్ మార్కెట్ వాటా భారీగా పెరిగింది. ఈ విభాగంలో బ్యాంకు రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. దేశంలోని హోమ్ లోన్ మార్కెట్లో స్టేట్‌ బ్యాంక్‌కు ఏకంగా 34 శాతం మార్కెట్ వాటా ఉండటం విశేషం.
Published by:Krishna Adithya
First published: