హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా

SBI Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా

SBI Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Account Transfer | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ హోల్డర్లు ఆన్‌లైన్‌లోనే తమ ఎస్‌బీఐ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ హోల్డరా? ఒక బ్రాంచ్‌లో ఉన్న మీ సేవింగ్స్ అకౌంట్‌ను (Savings Account) మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఒకప్పుడు ఈ ప్రక్రియ కాస్త పెద్దగా ఉండేది. బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి, కొన్ని రోజులపాటు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఈ పని కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ (SBI Account Transfer) చేయొచ్చు. ఈ ప్రాసెస్‌ను చాలాకాలం క్రితమే ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ఆన్‌లైన్‌లో కొన్ని సింపుల్ స్టెప్స్‌తో బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా

Step 1- ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.

Step 2- లాగిన్ అయిన తర్వాత Personal Banking ఆప్షన్ ఓపెన్ చేయాలి.

Step 3- ఇ-సర్వీస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

Step 4- Transfer Savings Account పైన క్లిక్ చేయాలి.

Step 5- మీకు ఒకటి కన్నా ఎక్కువ ఎస్‌బీఐ అకౌంట్స్ ఉంటే మీరు ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.

Step 6- మీరు ఏ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.

Step 7- వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని కన్ఫామ్ బటన్ పైన క్లిక్ చేయాలి.

Step 8- మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 9- ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

New Rules: జనవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

కొన్ని రోజుల్లోనే మీ బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ నుంచి మీరు కోరుకున్న బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లోనే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. యోనో ఎస్‌బీఐ యాప్‌లో కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

IRCTC Kashmir Tour: వైజాగ్ టు కాశ్మీర్... తక్కువ ధరకే 6 రోజుల ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

Step 3- Transfer of Saving Account ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 4- మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.

Step 5- మీరు ఏ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.

Step 6- బ్యాంకు పేరు డిస్‌ప్లే అవుతుంది. వివరాలు చూసుకొని సబ్మిట్ చేయాలి.

Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

First published:

Tags: Bank account, Saving account, Sbi, State bank of india

ఉత్తమ కథలు