మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి జస్ట్ ఓ మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ చాలు. ఇందుకోసం మీరు ఎస్బీఐ క్విక్ సర్వీస్‌కు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాలెన్స్‌ని సులువుగా తెలుసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు 'ఎస్బీఐ క్విక్' సేవల కోసం రిజిస్టర్ చేసుకోవడానికి REG <space> Account Number అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఏటీఎంలో కూడా 'ఎస్బీఐ క్విక్' సేవలకు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వస్తుంది. మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి. బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది. ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫోన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
'ఎస్బీఐ క్విక్' సేవలకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీకు ఎస్ఎంఎస్లో బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. చివరి 5 లావాదేవీల మినీ స్టేట్మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.
'ఎస్బీఐ క్విక్' సేవలను ఆపెయ్యాలనుకుంటే డీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.
ఇవి కూడా చదవండి:
SBI account: ఎస్బీఐ అకౌంట్ 4 నిమిషాల్లో... ఆన్లైన్లో తీసుకోండి ఇలా
PAN-Aadhaar Link: జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
SBI Gold Loan: స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ గోల్డ్ లోన్... తీసుకోండి ఇలా